Home Film News దేవర, పుష్ప2 వాయిదా..? మొత్తం గందరగోళం..!
Film News

దేవర, పుష్ప2 వాయిదా..? మొత్తం గందరగోళం..!

ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే జరగకూడదు అనుకున్నారో.. ఇప్పుడు అదే జరగబోతుంది.. దేవ‌ర మూవీ వాయిదా పడిందనే మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీనికి పలు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీఖానికి షూటింగ్లో గాయాల అవటం ఒకటైతే.. తర్వాత ఏపీ ఎలక్షన్స్ కూడా ఎన్టీఆర్ దేవరను వెనక్కి వేళ్లేలా చేసిందని అంటున్నారు. ఏప్రిల్5న దేవర రిలీజ్ అని ముందే అనౌన్స్ చేశారు మేకర్స్.

article_image3

అదే సమయంలో ఎన్నికలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమా యూనిట్ దేవరను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వీటికి తోడు ఏప్రిల్ 5న బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంటుంది. అదే రోజు ఈద్ కావడంతో అక్కడ థియేటర్లు దొరకడం కూడా చాలా కష్టం. ఇలా పలు కారణాలతో దేవ‌ర‌ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఈ సినిమా యూనిట్ నుంచి ఇంక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే బయటకు రాలేదు.. కానీ దాదాపు దేవర మూవీ వాయిదా పడినట్టే అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వ‌స్తున్న‌ సమాచారం.

Pushpa 2 to Devara: A glimpse into Tollywood's exciting sequels

ఇక ఎన్టీఆర్ దేవర సినిమా ఎప్పుడు వస్తుంది.. అంటే దానిపై కూడా కొత్త చర్చ జరుగుతుంది. సమ్మర్ ఎండింగ్ లేదా ఆగస్టు అప్పటికి కుదరకపోతే సెప్టెంబర్ లో దేవరను రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆగస్టులో దేవర వస్తుందంటే అప్పటికే పుష్ప2 ఆగస్టు రేసులో ఉంది. ఒకవేళ దేవర ఆగస్టు 15న వస్తే పుష్ప2 కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ పుష్ప సెకండ్ పార్ట్ ని కూడా డిసెంబర్ కు రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే ఈ వార్తలపై కూడా ఇంకా క్లారిటీ లేదు.. కానీ దేవర పార్ట్ వన్, పుష్ప2 రిలీజ్ డేట్‌లు మాత్రం అభిమానులను ఎంతో కన్ఫ్యూజ్‌లు  పడేశాయి.  ప్రస్తుతానికి దేవర టీం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...