Home Film News KTR Pawan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు అన్న లెక్క‌… ఇంట్రెస్టింగ్‌గా మారిన కేటీఆర్ కామెంట్స్
Film News

KTR Pawan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు అన్న లెక్క‌… ఇంట్రెస్టింగ్‌గా మారిన కేటీఆర్ కామెంట్స్

KTR Pawan: ఒక‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టుడు. కాని ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుడు కూడా. సినిమాలు చేస్తూనే రాజ‌కీయాల‌లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. 2014లో జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్ప‌టి నుండి గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా రాజ‌కీయాల‌లో ముందుకు సాగుతున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాల‌లో వారాహి యాత్ర చేస్తున్నారు. ప‌లు ప్రాంతాలలో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హిస్తూ వైసీపీ నాయ‌కులు చేసే అక్ర‌మాల‌ని ఎత్తి  చూపుతున్నారు. జ‌న‌సేన‌కి ఒక్క‌సారి అవ‌కాశం ఇచ్చి చూపండి. ఆంధ్ర్ర‌ప్రదేశ్‌ని అభివృద్ది చేసి చూపిస్తామ‌ని అంటున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయ‌న జూన్ 30 వ‌ర‌కు ఏపీలో వారాహి యాత్ర చేసి ఆ త‌ర్వాత స్వ‌ల్ప విరామం తీసుకుంటారు.

ఇక వారాహి యాత్ర‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. ఆయ‌న గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాకు మంచి మిత్రుడు.  అన్న లాంటి వాడు. ఇద్దరం చాలా సార్లు కలుసుకున్నాం. అనేక విష‌యాల గురించి మాట్లాడుకున్నాం.  మా ఇద్ద‌రి  అభిరుచులు చాలా విష‌యాల‌లో కలుస్తాయి. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టం. నాకు కూడా కొంచెం ఇష్టం. అయితే రాజకీయాలు, స్నేహానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరి రాజకీయాలు వారివి. నారా లోకేష్‌తో కూడా నాకు ప‌రిచ‌యం ఉంది. జ‌గ‌నన్న కూడా మంచి స్నేహితుడే. అంద‌రు నాకు స్నేహితులు కాబ‌ట్టి ఎలాంటి స‌మ‌స్య‌లేద‌ని చెప్పారు.

ఇక ఏపీలో కూడా త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని కూడా కేటీఆర్ అన్నారు. బీజేపీని వ్యతిరేకించే ఏకైర‌ గొంతు బీఆర్‌ఎస్‌ మాత్రమే.  మా పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందాక కేంద్రంలో క్రియాశీల‌క‌ పాత్ర పోషించాలనుకుంటున్నాం.. రానున్న రోజుల‌లో అది చూస్తారు అని కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. మేము ఎవ‌రితో లాలూచీ ప‌డ‌ము. ఎవ‌రికి లొంగిపోము. బ్ర‌తికున్న రోజులు పోట్లాడుతూనే ఉంటామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు మెగా హీరోల పలు సినిమా వేడుకలకి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...