Home Film News Dhoni’s Wife: ధోని భార్య‌కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్ట‌మా..ఆయన సినిమా ఒక్క‌టి కూడా మిస్ చేయలేదట‌..!
Film News

Dhoni’s Wife: ధోని భార్య‌కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్ట‌మా..ఆయన సినిమా ఒక్క‌టి కూడా మిస్ చేయలేదట‌..!

Dhoni’s Wife: మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని క్రికెట్‌కి గుడ్ బై చెప్పాక బిజినెస్‌ల‌పై దృష్టి పెట్టాడు. ప‌లు వ్యాపారాలు చేస్తున్న అత‌ను సినిమా రంగంపై కూడ దృష్టి సారించాడు.  ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్ పేరిట కొత్త‌ నిర్మాణ సంస్థను స్థాపించి.. తన భార్య సాక్షిని నిర్మాతను చేసి.. తొలి ప్రయత్నంగా ఎల్‌జీఎమ్ అనే తమిళ సినిమాను నిర్మించారు. ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. హరీష్ కళ్యాణ్, ఇవానా  హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నదియా  కీలక పాత్ర పోషించారు. రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యోగిబాబు, మిర్చి విజయ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో  ధోని భార్య సాక్షి ధోని   తన సినిమా ప్రమోషన్స్ కోసం హైద‌రాబాద్‌కి వ‌చ్చి సంద‌డి చేశారు.. బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.ఇక ఈ ఈవెంట్‌లో మాట్లాడిన సాక్షి.. మా వారు ఎప్పుడు ఏదో ఒక స‌ర్‌ప్రైజ్ ఇస్తుంటారు. క్రికెట్ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కాని వారికి అది ప్రొఫెషన్‌గా మారింది.సినిమా కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాబ‌ట్టి ఇప్పుడు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాం. మేము ఇద్ద‌రం క‌లిసి సినిమాలు చాలా చూస్తాం. అటు థియేట‌ర్‌లో, ఇటు ఓటీటీలో ఎన్నో చిత్రాలు చూశాం. రానున్న రోజుల‌లో మ‌రెన్నో చిత్రాలు నిర్మించ‌డానికి మేము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పుకొచ్చింది.

తెలుగులో కూడా ధోనికి భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు కాబ‌ట్టి ఈ చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. నేను తెలుగు హీరో  అల్లు అర్జున్ సినిమాల‌న్నింటినీ చూశాను. అత‌నికి చాలా పెద్ద అభిమానిని.   అల్లు అర్జున్ సినిమాలన్నీ కూడా నేను చూసేశాను.అప్పుడు  నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటివి లేక‌పోయిన కూడా యూట్యూబ్‌లో గోల్డ్‌మైన్ ప్రొడక్షన్ ఛానెల్‌లోనే సినిమాలన్నీ చూశాను. వాళ్లు తెలుగు సినిమాలన్నింటినీ హిందీలోకి అనువాదం చేస్తారు  కాబట్టి అల్లు అర్జున్ సినిమాలు చూస్తూ నేను పెరిగాను అని సాక్షి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.  ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు  చేసే అవ‌కాశం ఉందా అంటే.. బాబోయ్ అన్ని డబ్బులు నా దగ్గర లేవు అని నవ్వుతూ చెప్పారు సాక్షి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...