Home Film News Chiru Fans Vs Pawan Fans: చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ మ‌ధ్య ఫైట్.. క్ష‌మాప‌ణ చెప్ప‌నంటున్న అరుణ‌
Film News

Chiru Fans Vs Pawan Fans: చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ మ‌ధ్య ఫైట్.. క్ష‌మాప‌ణ చెప్ప‌నంటున్న అరుణ‌

Chiru Fans Vs Pawan Fans: ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో పాటు సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విష‌యం మ‌నంద‌రికి విదిత‌మే. ఆయ‌న‌ని ఎవరైన ఒక్క మాట అంటే వెంట‌నే కౌంట‌ర్ ఇస్తుంటారు ప‌వ‌న్ అభిమానులు. చివరికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అయినా , మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో అయిన వార్‌కి దిగుతుంటారు. ఇప్పుడు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రాయపాటి అరుణ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల మ‌ధ్య చిచ్చు పెట్టిన‌ట్టు అయింది.  తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన డిబెట్ కార్య‌క్ర‌మంలో  ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయడం చాలా పెద్ద త‌ప్పు అని,  చిరంజీవి నిర్ణయం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ఇబ్బందులో ప‌డింద‌ని ఆమె అన్నారు.
political-fans-fught
చిరంజీవి వ‌ల‌న రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో న‌ష్ట‌పోయారు. అయితే ఆయ‌న‌కేం న‌ష్టం జ‌ర‌గ‌లేదు, తిరిగి సినిమాలు చేసుకుంటున్నారు అని అరుణ పేర్కొంది..  రాయపాటి అరుణ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్క‌డ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  రాయ‌పాటి అరుణ‌ని చిరంజీవి ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయ‌డంతో ఇప్పుడు.. రాయపాటి అరుణకు అండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిలుస్తున్నారు.గ‌తంలో వైసీపీ నాయకులు పలుమార్లు చిరంజీవిని అవమానించినప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ఏం చేస్తున్నారని కౌంటర్లు వేస్తున్నారు.

అయితే ఈ విష‌యంలో రాయ‌పాటి అరుణ త‌గ్గేదే లే అంటుంది.  పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి అడిగిన సరే ‘క్షమాపణలు’ చెప్పేదే లేదంటుంది.  అసలు ఈ విషయంలో చిరంజీవి యువత ఎందుకు వ‌చ్చార‌ని రాయపాటి అరుణ ప్ర‌శ్నిస్తుంది.  వీడియోని పూర్తిగా చూసిన తర్వాత క్షమాపణలు మీరు చెప్తారో.. నేను చెప్పాలోమీకు  తెలుస్తుందని చిరంజీవి అభిమానులను ఉద్దేశించి అరుణ అన్నారు.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ వ‌ల్ల‌నే ఇది జ‌రుగుతుంద‌ని,  ఈ ట్రాప్‌లో చిరంజీవి అభిమానులు పడ్డారని స్ప‌ష్టం చేసింది.  అయితే ఈ వివాదం శృతి మించుతున్న నేప‌థ్యంలో నాగ‌బాబు స్పందిస్తూ.. రాయపాటి అరుణ జనసేనకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఆమె ఆవేశంలో నోరు జారి ఒక మాట అన్నారు. అంతకు మించి ఎలాంటి  దురుద్దేశం లేదు. రాయపాటి అరుణను నిందించడం ఆపాలంటూ త‌న సందేశంలో తెలిపారు. .

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...