Home Film News Varun Tej: వ‌రుణ్ తేజ్ పెళ్లి సాయిధ‌ర‌మ్‌కి ఎన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టాయి..!
Film News

Varun Tej: వ‌రుణ్ తేజ్ పెళ్లి సాయిధ‌ర‌మ్‌కి ఎన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టాయి..!

Varun Tej: ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ పెళ్లిళ్లు, విడాకుల విష‌యంతో తెగ హాట్ టాపిక్ అవుతుంది.మెగా ఫ్యామిలీకి చెందిన శ్రీజ పెళ్లి రెండు సార్లు పెటాకుల‌యింది.  మెగా డాటర్‌ నిహారిక పెళ్లి  చైతన్య జొన్నలగడ్డతో మూడేళ్ల క్రితం గ్రాండ్‌గా జరిగింది. వారు కూడా విడిపోయార‌ని మెగా అభిమానులే చెబుతున్నారు. వీరిద్ద‌రి విడాకుల‌పై జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో  వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు. వీరిద్దరు కూడా కొంత‌కాలంగా లవ్‌ లో ఉన్నారని వార్త‌లు వ‌స్తున్నా కూడా వాటిపై సైలెంట్‌గా ఉంటూ, ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్‌తో ఓపెన్‌ అయ్యారు.

వరుణ్‌, లావణ్యల ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో కుటుంబ స‌భ్యుల మ‌ధ్య  గ్రాండ్‌గా జరిగింది. మెగా ఫ్యామిలీతోపాటు అల్లు కుటుంబ సభ్యులు, ప‌లువురు సన్నిహితులు ఈ ఎంగేజ్‌మెంట్‌కి హాజరయ్యారు. ఏడాది చివ‌రిలో వీరిద్ద‌రు పెళ్లి పీట‌లెక్కే ఛాన్స్ ఉంది. అయితే  వ‌రుణ్‌ తేజ్‌-లావణ్యల పెళ్లి ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కి లేని పోని చిక్కులు తెచ్చిపెట్టిన‌ట్టు క‌నిపిస్తుంది. వ‌రుణ్ తేజ్ నిశ్చితార్థం పూర్త‌య్యాక సాయి ధ‌ర‌మ్ తేజ్ వ్య‌వ‌హారం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. గ‌తంలో సాయిధ‌ర‌మ్ తేజ్, రెజీనా ప్రేమ వ్య‌వ‌హారంకి సంబంధించి జోరుగా వార్త‌లు వ‌చ్చాయి.

తేజ్, రెజీనా ఇద్దరు కలిసి తిరిగినట్టు న్యూస్‌ చక్కర్లు కొట్టాయి.  కాని కొంత కాలానికి అవి ఆగిపోయాయి. ఈ ఇద్దరు కలిసి `పిల్ల నువ్వులేని జీవితం`, `సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌` చిత్రాల్లో నటించిన నేప‌థ్యంలో వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ని అన్నారు.  అయితే వాటిపై సాయిధ‌ర‌మ్ తేజ్ స్పందించ‌క‌పోవ‌డంతో అవి పుకార్లుగానే మిగిలిపొయాయి. అయితే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ గ‌త ఐదారేళ్లుగా లావ‌ణ్య త్రిపాఠితో ప్రేమ‌లో ఉండి ఇప్పుడు ఆమెని వివాహం చేసుకోబోతున్న నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఇలానే రెజీనాని పెళ్లి చేసుకుంటాడేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్, రెజీనాకి సంబంధించిన  వార్త‌లు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ చివ‌రిగా విరూపాక్ష అనే సినిమాతో పెద్ద విజ‌యం అందుకున్నాడు.

Related Articles

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

అలా చేయడానికి బాలయ్య రెడీ.. పవన్ ఒప్పుకుంటారా..!?

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ మనం చూస్తూనే ఉన్నాం. మరీ...

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...