Home Film News Guntur Kaaram: సంక్రాంతి బరి నుండి తప్పుకున్న గుంటూరు కారం.. ఏం జరిగింది?
Film News

Guntur Kaaram: సంక్రాంతి బరి నుండి తప్పుకున్న గుంటూరు కారం.. ఏం జరిగింది?

Guntur Kaaram: స‌ర్కారు వారి పాట చిత్రం త‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీ రూపొందుతుంది. ఎస్ఎస్ఎమ్‌బీ 28 వర్కింగ్ టైటిల్‌తో మొన్న‌టి వ‌ర‌కు బ‌జ్ క్రియేట్ చేసిన చిత్రం  టైటిల్‌ అనౌన్స్ మెంట్‌తో అంతకు మించిన రేంజ్లో రీసౌండ్ చేస్తుంది. ఇటీవ‌ల హాలీవుడ్ పాపులర్ మ్యాగజైన్‌లో కూడా మహేష్ మాస్ స్ట్రైక్ ఓ ఆర్టికల్ గా వ‌చ్చింది. సినిమా డీటెయిల్స్ తో పాటు.. టైటిల్ టీజర్ లింక్‌ కూడా పబ్లిష్  చేయ‌డం మ‌హేష్ ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసుకునేలా చేసింది. గ్లింప్స్ లో మ‌హేష్ మంచి మాస్ లుక్ లో క‌నిపిస్తూ ఉండే సరికి ప్ర‌తి ఒక్క‌రు కూడా మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వ‌చ్చి అత‌డు, ఖ‌లేజా చిత్రాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో గుంటూరు కారంపై కూడా అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.   13 ఏళ్ళ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో  మూవీ వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఈ సినిమాపై ఆస‌క్తిని క‌న‌బరుస్తున్నారు. మూవీని  2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు గ‌తంలో ప్రకటించారు. అయితే షూటింగ్ అనుకున్న ప్రకారం జరగడం లేద‌ని,  షెడ్యూల్స్ లో మార్పులు జరగడంతో ఇతర నటుల డేట్స్ సమస్య  వ‌స్తుంద‌ని స‌మాచారం.

జూన్ 12 నుండి కొత్త షెడ్యూల్ మొదలు కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ అది మ‌రింత వెనక్కిపోయింద‌ట‌. సినిమాలోని కీలక నటులు బిజీగా ఉన్న నేప‌థ్యంలో షూటింగ్ వాయిదా పడుతుంది. మ‌హేష్ ఖాళీగా ఉన్న కూడా ఇతర న‌టీన‌టుల డేట్స్ ఖాళీ లేక‌పోవ‌డంతో చిత్ర షూటింగ్ జూలైలో మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త కొద్ది రోజులుగా షూటింగ్ ప‌లుమార్లు వాయిదా ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయ‌డం క‌ష్ట‌మే అని అనిపిస్తుంది. ఇక గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే  క‌థానాయిక‌గా  నటిస్తుంది. శ్రీలీల మరో హీరోయిన్ గా సంద‌డి చేయ‌నుంది. మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై  సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మహేష్ ఈ చిత్రంలో  ఊరమాస్ రోల్ తో సంద‌డి చేయ‌నున్నాడు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...