Home Film News Tollywood: టాలీవుడ్‌కి మ‌రో ఐరెన్ లెగ్.. ఆమెతో సినిమా చేస్తే ఫ్లాప్ అయిన‌ట్టేనా?
Film News

Tollywood: టాలీవుడ్‌కి మ‌రో ఐరెన్ లెగ్.. ఆమెతో సినిమా చేస్తే ఫ్లాప్ అయిన‌ట్టేనా?

Tollywood: టాలీవుడ్‌లో ఇటీవ‌ల గోల్డెన్ లెగ్, ఐరెన్ లెగ్ అంటూ రెండు గ్రూపులుగా హీరోయిన్స్‌ని డివైడ్ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో శృతిహాస‌న్‌ని ఐరెన్ లెగ్ అనే వారు. కాని గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం త‌ర్వాత ఈ భామ గోల్డెన్ లెగ్‌గా మారింది. ఇక  కొద్ది రోజుల క్రితం  వరుస హిట్లు ఇచ్చిన హీరోయిన్ పూజ హెగ్డే తర్వాత ఇక్కడ పెద్ద ఐరన్ లెగ్ హీరోయిన్ అయిపోయింది. ఆమె నటించిన సినిమాలు వ‌రుస ఫ్లాపులు ద‌క్కించుకున్నాయి.  చాలా తక్కువ టైంలోనే పూజ నటించిన మూడు నాలుగు సినిమాలు డిజాస్ట‌ర్స్ కావ‌డంతో ఆమె కూడా ఐరెన్ లెగ్ ఖాతాలో చేరింది. ఇక నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా వ‌రుస హిట్స్‌తో స్టార్ స్టేట‌స్ చేరుకుంది. అలానే ఈ అమ్మడికి బాలీవుడ్ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. పుష్ప చిత్రం మంచి విజ‌యం ద‌క్కించుకుంది. కాని త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించ‌డంతో ఐరెన్ లెగ్ బిరుదు అందుకుంది.

పూజ – రష్మిక కేరీర్‌ ప్రారంభంలో కొన్ని హిట్లు న‌మోదు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకోగా, కొత్త హీరోయిన్ మాత్రం వ‌రుస ఫ్లాపుల‌తో కెరీర్ ప్రారంభించింది.  టాలీవుడ్లోకి వచ్చి రావడంతోనే పెద్ద ఐరన్ హీరోయిన్గా ముద్ర పడిపోయింది  సాక్షి వైద్య. అక్కినేని అఖిల్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ లో సాక్షి క‌థానాయిక‌గా న‌టించ‌గా, ఈ సినిమా  ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే.  ఈ సినిమా దెబ్బతో నిర్మాత అనిల్ సుంకరతో పాటు ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్ గాయత్రి సతీష్ చాలా న‌ష్టాలు చ‌విచూశారు.

ఏజెంట్ సినిమా అఖిల్ కెరీర్ పై కూడా చాలా  పెద్ద దెబ్బ కొట్టింది. ఇక ఇటీవ‌ల  మెగా హీరో వరుణ్ తేజ్‌ నటించిన గాండీవ ధారి అర్జున సినిమాలోని సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించగా,     సినిమా కూడా వరుణ్ తేజ్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా నిర్మాత  బివిఎస్ఎన్ ప్రసాద్‌కు ఏకంగా రు. 20 కోట్లకు పైగా నష్టాలు తెచ్చిపెట్టిన‌ట్టు తెలుస్తుంది. ఇంత లాస్ వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో ఎప్పుడు రాలేదు. ఇదంతా సాక్షి మ‌హిమ‌నే అంటున్నారు. సాక్షి న‌టించిన రెండు సినిమాలు  ఆ హీరోల కెరీర్ లో పెద్ద డిజాస్టర్లు అయిపోవడంతో సాక్షిని అప్పుడే టాలీవుడ్ జనాలు ఐరన్ లెగ్ అని, ఆమెతో సినిమా చేస్తే ఫ్లాప్ కావ‌డం ఖాయం అని చెబుతున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితుల‌లో సాక్షికి రానున్న రోజుల‌లో సినిమా అవ‌కాశాలు వ‌స్తాయా లేదా అనేది చూడాలి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...