Home Film News Kushi Director: ట్రీట్ మెంట్ మధ్యలో సమంత షూటింగ్ కి వస్తానంది..ఖుషి డైరెక్టర్
Film News

Kushi Director: ట్రీట్ మెంట్ మధ్యలో సమంత షూటింగ్ కి వస్తానంది..ఖుషి డైరెక్టర్

Kushi Director: టాలీవుడ్‌లో ప్రేమ క‌థా చిత్రాల‌ని స‌రికొత్త‌గా ఆవిష్క‌రించే ద‌ర్శ‌కుల‌లో శివ నిర్వాణ ఒక‌రు. ఆయ‌న  ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీష్’ సినిమాలు తీసి కుటుంబ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. తాజాగా ఖుషీ అనే చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందించాడు.   సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న నేప‌థ్యంలో  డైరెక్టర్ శివ నిర్వాణ కొన్ని ఆసక్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.  డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్‌కి ఈ కథ  చెప్ప‌గా, ఏడాదిన్నర తర్వాత సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాం. అప్పుడు ఖుషి కథ చిన్న పాయింట్‌గా చెప్పగా, ఆయ‌న‌కి ఎంతో  బాగా నచ్చేయ‌డంతో  ‘ఖుషి’ జర్నీ మొదలైంది అని శివ నిర్వాణ అన్నారు.
‘ఖుషి’ చిత్రం.. మణిరత్నం ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలూ వచ్చాయి కానీ అలా కాదు. యూనిక్ పాయింట్ ఉంటుంది.  ప్రస్తుత సమాజంలో ఉన్న ఒక సమస్యను విజయ్, సమంత వంటి స్టార్స్ తో చెబితే బాగుంటుంద‌ని తెలిసి ఈ సినిమా తీసారు. ట్రైల‌ర్ ఆ పాయింట్ చెప్ప‌లేదు.  విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు  ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది  అని ఖుషి అనే టైటిల్ పెట్టాం. విజ‌య్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా  సమంత లాంటి హీరోయిన్కూడా తోడైతే మరింత స్ట్రాంగ్ అవుతుందని ఆమెని అప్రోచ్ అయ్యాం.  ఇక  సమంత షూటింగ్ కోసం ఎంతో కోపరేట్ చేస్తారు. చాలా డెడికేటెడ్ హీరోయిన్ ఆమె . అంత మంచి హీరోయిన్ కి హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మేమంతా సపోర్ట్ చేయకపోతే ఎలా.. ఆమె ట్రీట్‌మెంట్ మధ్యలో వస్తా అని చెప్పేది కానీ మధ్యలో గ్యాప్ ఇస్తూ షెడ్యూల్స్ చేయడం ఇబ్బందిగా ఉండి.. పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని ఆమెకి చెప్పామ‌ని శివ  నిర్వాణ అన్నారు..
విజయ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందం సినిమాల్లో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. ఈ చిత్రం కూడా  మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం అని శివ నిర్వాణ అన్నారు.  ‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్‌కు పోలిక‌లు ఉన్నాయ‌ని చాలా ప్ర‌చారాలు జ‌ర‌గ‌గా,  ఎలాంటి పోలికలు, సంబంధం లేదు. నేను మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఆమెతో మజిలీ సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదు అని ఇందులోకి తీసుకున్నాం అని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...