Home Film News Yadamma Raju: తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చేరిన యాద‌మ్మ రాజు.. ఏమైందంటూ ఆందోళ‌న‌లో ఫ్యాన్స్
Film News

Yadamma Raju: తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చేరిన యాద‌మ్మ రాజు.. ఏమైందంటూ ఆందోళ‌న‌లో ఫ్యాన్స్

Yadamma Raju: బుల్లితెర‌పై తమ టాలెంట్ చూపిస్తూ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న వారిలో యాద‌మ్మ రాజు ఒక‌రు. ప‌టాస్ షోతో మొదలైన ఆయన కెరీర్ ఇప్పుడు స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. కొద్ది రోజుల వ‌ర‌కు  స్టార్ మాలో అలరించిన యాద‌మ్మ‌రాజు ఇప్పుడు జబర్దస్త్ లో కమెడియన్ సద్దాంతో కలిసి టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. రీసెంట్‌గా పెళ్లి పీటీలు కూడా ఎక్కాడు. ఎంతో సంతోషంగా సాగుతున్న ఆయ‌న లైఫ్‌లో ఊహించ‌ని ప్ర‌మాదం జ‌రిగింది. యాద‌మ్మ‌రాజు  సడెన్ గా  ఆస్పత్రిలో చేరాడు. ప్రమాదంలో ఆయన కుడి కాలికి గాయం అయిన‌ట్టు తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

అయితే తాజాగా యాద‌మ్మ రాజు స‌తీమ‌ణి స్టెల్లా రాజు   ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో యాదమ్మ రాజు ఆస్పత్రి బెడ్ పై ఉండ‌గా, ఆయ‌న  బెడ్ మీద నుంచి దిగేందుకు ప్ర‌య‌త్నించాడు.. పక్కనే ఉండి స్టెల్లా కూడా సహాయం చేస్తూ ఉంది. ఇక  ఆ వీడియోకి ‘గెట్ వెల్ సూన్ బేబీ అయామ్ దేర్ ఫర్ యూ’ అంటూ స్టెల్లా రాజ్ ఓ కొటేషన్ పెట్టింది. ఆమె షేర్ చేసిన వీడియో చూసి అంద‌రు ఒక్క‌సారిగా కంగుతిన్నారు. మొన్న‌టి వ‌ర‌కు మంచిగానే ఉన్న యాద‌మ్మ రాజు ఇలా స‌డెన్‌గా ఆసుప‌త్రిలో చేరే స‌రికి అంద‌రు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

యాదమ్మ రాజుని ఇలాంటి  ప‌రిస్థితిలో చూసి అతని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. నెటిజన్స్ కూడా  షాక్‌లో ఉన్నారు. యాదమ్మ రాజుకు ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఇంట్లో ఏమైనా కాలు జారి పడ్డాడా? ఏదైనా ప్రమాదం జరిగిందా? న‌ఇ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి స్టెల్లా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మాత్రం స్పందించ‌లేదు. అయితే   యాదమ్మ రాజు- స్టెల్లా అభిమానులు మాత్రం గెట్ వెల్ సూన్ అంటూ ప్రార్ధిస్తున్నారు. కాగా, య‌ద‌మ్మ రాజు తాను ప్రేమించిన అమ్మాయి స్టెల్లాను వివాహం చేసుకొని కొద్ది రోజుల క్రిత‌మే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. వీరిద్ద‌రు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వారు చేసే అల్లరి చూసి ఫ్యాన్స్ తెగ ముచ్చటపడిపోతుంటారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...