Home Film News Pawan Kalyan: ప‌వన్ క‌ళ్యాణ్‌కి అవ‌మానం.. ఎవ‌డ్రా అంటూ అత‌నికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి
Film News

Pawan Kalyan: ప‌వన్ క‌ళ్యాణ్‌కి అవ‌మానం.. ఎవ‌డ్రా అంటూ అత‌నికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి చాలా కూల్‌గా ఉంటారు, ఎవ‌రు ఏమ‌న్నా కూడా ఆయన పెద్ద‌గా ప‌ట్టించుకోరు.ఆయ‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు చేసిన విని ఊకుంటారే త‌ప్ప పెద్ద‌గా స్పందించ‌రు. తాజాగా చిరంజీవి ఆగ్ర‌హం గురించి బాబీ.. బోళా శంక‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు. ఇది విని ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. ద‌ర్శ‌కుడు బాబి మాట్లాడుతూ.. ఆచార్య, భోళా శంకర్, వీరయ్య, గాడ్ ఫాదర్ షూటింగ్స్ వరుస‌గా నడుస్తూ వ‌చ్చాయి. ఆచార్య త‌ర్వాత గాడ్ ఫాద‌ర్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ రీమేక్ అంటే బాగోద‌ని వాల్తేరు వీర‌య్యని తీసుకొచ్చాం. మెహ‌ర్ ర‌మేష్ గారు మాకు ఎంతో స‌పోర్ట్ ఇచ్చారు. మూవీ మంచి విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నా అని బాబీ అన్నారు.

వీర‌య్య మూవీ త‌ర్వాత చిరంజీవిపై నాకు మ‌రింత గౌర‌వం పెరిగింది. ఆది ఒక్కో మాట మాట్లాడుతుంటే.. నాకు స్టేజ్ పైకి వ‌చ్చి ఎత్తుకోవాల‌ని అనిపించింది. అభిమానుల మంట ఎలా ఉంటుందో ఆయ‌న చెప్పాడు. చిరంజీవికి కోపం రాదు అని అంద‌రు అనుకుంటారు, కాని ఆయ‌న ఒక‌సారి చాలా సీరియ‌స్ అయిన విష‌యాన్ని చెబుతాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ షూటింగ్ ఓ పెద్ద డాక్ట‌ర్ ఇంట్లో జ‌రుగుతుంది.అయితే లైట్‌మెన్స్ షూలు వేసుకొని న‌డుస్తుండ‌గా, డాక్ట‌ర్స్ ఇడియట్స్ గెట్ అవుట్ అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు.అప్పుడు పవన్ కళ్యాణ్ లోప‌లికి వ‌చ్చి ఏం జ‌రిగింద‌ని అడిగారు.. అప్పుడు షూలు వేసుకుని నడవొద్దు అని చెప్పాను అని అన్నారు. మీరు ఇల్లు షూటింగ్ కోసమే కదా ఇచ్చారు.. డబ్బులు తీసుకున్నారు కదా? ఏం ప్రాబ్లం అని అన్నారు. అప్పుడు వాళ్లను షూలు వేసుకోనివ్వకపోతే.. నేను షూటింగ్ చేయను.. వెళ్లిపోతాను అని పవన్ కళ్యాణ్ అలిగి వెళ్ల‌గా, ఈ విష‌యం వేరే నిర్మాతల ద్వారా చిరంజీవికి తెలిసింది.

 

అప్పుడు వెంట‌నే డాక్ట‌ర్‌కి ఫోన్ చేసి ఎవడ్రా నువ్.. ఇంట్లోంచి వెళ్లమనడానికి.. నువ్వెంత నీ ఇళ్లు ఎంత.. సినిమా వాళ్లు కష్టపడతారని తెలిసే కదా నువ్ నీ ఇళ్లు ఇచ్చింది.. డబ్బులు తీసుకుంటున్నావ్ కదా? నీకు నిజంగానే నీ ఇంటి మీద అంత ప్రేమ ఉంటే.. తాళం వేసుకుని కూర్చో.. షూటింగ్‌లకు ఇవ్వొద్దు.. రెంట్లు వసూల్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చార‌ట‌. నా త‌మ్ముడు అలిగి వెళ్లి గంట అయింది కాబ‌ట్టి కామ్‌గా ఉన్నా, వెంట‌నే తెలిసి ఉంటే వ‌చ్చి షూటింగ్ జరిపించే వాడ్ని అని చిరంజీవి గారు చాలా సీరియ‌స్ అయ్యారంటూ బాబి చెప్పుకొచ్చారు. బాబీ చెప్పిన మాట‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...