Home Film News Baby Heroine: లిప్ లాక్ సీన్‌పై బేబి హీరోయిన్ షాకింగ్ రియాక్ష‌న్.. మా పేరెంట్స్ ఏమ‌న్నారంటే…!
Film News

Baby Heroine: లిప్ లాక్ సీన్‌పై బేబి హీరోయిన్ షాకింగ్ రియాక్ష‌న్.. మా పేరెంట్స్ ఏమ‌న్నారంటే…!

Baby Heroine: ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి, విరాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన చిత్రం బేబి. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్ కె ఎన్ నిర్మించ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌డుతుంది. చిత్రంలో హీరో కన్నా కూడా హీరోయిన్‌కి మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ యువ‌త‌లో క్రేజీ భామ‌గా మారింది. ప్రస్తుతం బేబీ విజయాన్ని,ఆ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న వైష్ణవి చైతన్య తాజాగా లిప్ లాక్ సీన్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. బోల్డ్ సీన్స్ లో న‌టించ‌డం, లిప్ లాక్ స‌న్నివేశాల గురించి వైష్ణ‌వి మాట్లాడిన మాట‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఏ చిత్రంలో అయిన‌ రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ లో నటించడం చాలా కష్టం అని వైష్ణవి చెప్పుకొచ్చింది. తాను ఈ విష‌యంలో అదృష్ట‌వంతురాలిని అని చెప్పిన వైష్ణ‌వి.. సెట్స్ లో త‌న‌కు ఎలాంటి అసౌక‌ర్యం లేదు అని పేర్కొంది. లిప్ లాక్ సీన్, రొమాంటిక్ సీన్ లో నటించేటప్పుడు సెట్ లో చాలా తక్కువ మందే ఉండ‌డంతో ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌లేదు . ఇక విరాజ్ అశ్విన్ కూడా మంచి సపోర్ట్ అందించాడు. అయితే చిత్రంలో ఇలాంటి రొమాంటిక్ స‌న్నివేశాలు ఉండ‌గా, వాటిలో మ‌నం న‌టిస్తున్నాం అని ధైర్యం అందించారు.సీన్ సినిమాలో భాగం అని వారు చెప్ప‌డంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా న‌టించ‌గ‌లిగాను. చిత్రంలో లిప్ లాక్ సన్నివేశం మాత్రమే కాదు, అంత‌కు మించిన ఎమోషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయ‌ని వైష్ణ‌వి పేర్కొంది.

 

మా కుటుంబ స‌భ్యులు కూడా మూవీ చూశారు. వాళ్ళు కూడా సినిమాలో భాగంగానే భావించారు అని వైష్ణవి తెలిపింది. టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కెరీర్ ప్రారంభించిన వైష్ణవి షార్ట్ ఫిలింస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప‌లు సినిమాల‌లో సైడ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేసింది. బేబి చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. ఈ జర్నీ చేరుకోవ‌డానికి తనకి ఎనిమిదేళ్లు పట్టింది అని వైష్ణవి చెప్పుకొచ్చింది. తాను ఇండస్ట్రీకి హీరోయిన్ అయిపోయి ఎదో సాధించాలని రాలేదని.. నటిగా స్థిరపడాలని భావించాను అని వైష్ణ‌వి తెలియ‌జేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...