Home Film News Harish Shankar: హ‌రీష్ శంక‌ర్‌కి పెద్ద షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ర‌వితేజ‌నే న‌మ్ముకున్న స్టార్ డైరెక్ట‌ర్
Film News

Harish Shankar: హ‌రీష్ శంక‌ర్‌కి పెద్ద షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ర‌వితేజ‌నే న‌మ్ముకున్న స్టార్ డైరెక్ట‌ర్

Harish Shankar: ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజ‌కీయాలు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయ‌న కొద్ది రోజులుగా షూటింగ్‌ల‌కి దూరంగా ఉంటూ పూర్తి రాజ‌కీయాల‌పైనే దృష్టి పెట్టారు. అయితే ఆయ‌న న‌టించిన బ్రో సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా,జూలై 28న విడుద‌ల కానుంది. ఇక ప‌వ‌న్ క‌మిటైన్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రాలు ఎప్పుడు పూర్తి చేస్తాడా అనే అనుమానాలు అంద‌రిలో త‌లెత్తుతున్నాయి.ఈ క్ర‌మంలో ప‌వ‌న్- హ‌రీష్ శంక‌ర్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా గురించి ఓ షాకింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ త‌ర్వాత ఆయ‌న ప్ర‌క‌టించిన చిత్రాల‌లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఒక‌టి. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఈ ఇద్దరి కాంబోలో మూవీ రూపొందుతుండ‌డంతో అంద‌రిలో భారీ అంచ‌నాలే ఉన్నాయి కొద్ది రోజులుగా ఈమూవీ షూటింగ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతుంది. ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా వేసిన సెట్స్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరించారు. శ్రీలీల కూడా ఇటీవ‌ల షూట్‌లో పాల్గొంది. ఇక ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ప్రాజెక్ట్ రద్దయ్యిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. రానున్న రోజుల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయంగా మ‌రింత బిజీ కానున్న నేప‌థ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పక్కన పెట్టేశారట.

 

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఆగిపోవ‌డంతో ఇక చేసేదేం లేక హరీష్ శంక‌ర్.. రవితేజ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారట. త్వరలో హరీష్-రవితేజ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఓ టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ వార్త మాత్రం ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. చూడాలి మ‌రి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హ‌రీష్ శంక‌ర్ దీనిపై ఏమైన స్పందిస్తాడా అన్న‌ది. కాగా పవన్ కళ్యాణ్ .. దర్శకుడు సుజీత్ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న‌ ఓజీ చిత్రం 50% షూటింగ్ జరుపుకుందని వినికిడి. పవన్ పూర్తి చేయాల్సిన మరొక ప్రాజెక్ట్ హరి హర వీరమల్లుపై అస‌లు ఎలాంటి అప్డేట్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా కూడా ఆగిపోయింద‌నే అంటున్నారు.

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...