Home Film News Vaishnavi Chaitanya: బేబి హీరోయిన్ వైష్ణ‌వి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే బిత్త‌ర‌పోవ‌ల్సిందే.. అందులో గిన్నీస్ రికార్డ్
Film News

Vaishnavi Chaitanya: బేబి హీరోయిన్ వైష్ణ‌వి బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే బిత్త‌ర‌పోవ‌ల్సిందే.. అందులో గిన్నీస్ రికార్డ్

Vaishnavi Chaitanya: కొంద‌రు ఎన్ని సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు కేవ‌లం ఒకే ఒక్క సినిమాతో వ‌స్తుంది. బేబి హీరోయిన్ వైష్ణ‌వి గ‌తంలో ప‌లు షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేసింది. అయితే ఈ అమ్మ‌డు బేబి సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది. విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో బేబి అనే చిత్రం రూపొంద‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్క‌రు కూడా వైష్ణ‌వి గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో వైష్ణ‌వి బ్యాక్ గ్రౌండ్‌పై కూడా ఆరాలు తీస్తున్నారు. ఇంతక‌ముందు వైష్ణ‌వి ఏం చేసింది అని కనుక్కుంటున్నారు. ఈ అమ్మ‌డు సినిమాల్లోకి రాకముందు యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా చేసింది. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరో గా నటించిన ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ తో ఈ అమ్మ‌డికి మంచి క్రేజ్ ద‌క్కింది.. ఇందులో వైష్ణవి గా వైష్ణవి చైతన్య తన ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టింది. దీని త‌ర్వాత ఈ అమ్మ‌డికి ప‌లు సినిమా అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురం లో’ చిత్రం లో అల్లు అర్జున్ కి చెల్లెలుగా , అలాగే నాని నటించిన ‘టక్ జగదీశ్’ చిత్రం లో కూడా ఒక కీల‌క పాత్ర పోషించింది.

 

అయితే ఈమ‌ సినీ రంగం లోకి రాకముందు ఏం చేసింది అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విష‌యాలు తెలుసుకొని నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు. చిన్నతనం నుండి వైష్ణవి కి డ్యాన్స్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, ఆమె కూచిపూడి డ్యాన్స్ వెయ్యడం లో నిష్ణాతురాలు అని తెలుస్తుంది. డ్యాన్స్ లో ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుందని అంటున్నారు. కూచిపూడి డ్యాన్స్ లో వైష్ణవి కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉందని అంటున్నారు. ఇక‌ 2014 లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన డ్యాన్స్ పోటీలలో వైష్ణవి చైతన్య నెంబర్ 1 స్థానం లో నిల‌వ‌గా, ఆ క్రేజ్ తోనే ఈవిడకి వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయని అంటున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...