Home Film News Nagababu Non Veg: నాగ‌బాబు నాన్ వెజ్ మానేయ‌డం వెనక ఉన్న అస‌లు క‌థ ఏంటంటే..!
Film News

Nagababu Non Veg: నాగ‌బాబు నాన్ వెజ్ మానేయ‌డం వెనక ఉన్న అస‌లు క‌థ ఏంటంటే..!

Nagababu Non Veg: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగాను, జ‌డ్జిగాను, రాజ‌కీయ నాయ‌కుడిగాను స‌త్తా చాటుతున్నారు. ఇటీవ‌ల త‌న కుమారుడు నిశ్చితార్థం జ‌రిపించిన నాగ‌బాబు ఏడాది చివ‌రలో వారికి వివాహం చేయించ‌నున్నాడు. అయితే తాజాగా నాగ‌బాబుకి సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. నాగ‌బాబు నాన్ వెజ్ మానేయ‌డానికి గ‌ల కార‌ణాన్ని తాజాగా వివ‌రించాడు. ఇది విని ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ఒకసారి నాకు తీవ్ర‌మైన జ్వ‌రం వ‌చ్చింది. న‌డ‌వ‌లేని పరిస్థితి. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో కూడా బాధ‌ప‌డ్డాను. గొంతు కూడా పోయింది.

అప్పుడు ఆరోగ్యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్న నేను నాకున్న చెడు అల‌వాట్ల‌న్ని మానేశాను. ఒక‌ప్పుడు నాన్ వెజ్ బాగా తినేవాడిని. ఇప్పుడు పూర్తిగా మానేసి వెజ్ తీసుకుంటున్నాను.  వేగాన్ డైట్ తీసుకుంటున్నా. మిల్క్  ప్రోడక్ట్స్ ఏ మాత్రం  తీసుకోను. ప్లాంట్ బేస్డ్ డైట్  మీదనే  బ్రతుకుతున్నా. లెస్ వయోలెన్స్. అతి తక్కువ హింసాత్మకంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. నాన్ వెజ్ తినాలంటే ఓ జీవి ప్రాణం తీయాలనేది చాలా కాలంగా నా మైండ్‌లో బ‌లంగా పాతుకుపోయింది. ఇటీవ‌ల దానిని చాలా సీరియ‌స్‌గా తీసుకున్న నేను నాన్ వెజ్ తిన‌డం మానేసాను.

కోళ్లు, మేక‌లు వంటి వాటిని కోసి  చంపి తినడం బాధగా అనిపిస్తుంది. ఆవు పాలు..గేదే పాలు  త్రాగడం కూడా నేను  పాపంగానే భావిస్తాను. అలా చేస్తే ఆవు దూడకి అన్యాయం చేస్తున్నా అనే ఫీలింగ్ నాకు క‌లుగుతుంది. పాలు..పెరుగు.. వెన్న..నెయ్యి అన్నీ మానేసి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో ఒక‌సారి వాడ‌తాను. బేసిక్ డైట్ లో ఇవి అస్స‌లు ఉండవు.  ప్లాంట్స్ లో కూడా ప్రాణం ఉంటుంది. మరి అది హింస కాదా అని అంటారు. కాని అవి తినకపోతే సచ్చిపోతాం.  బీపీ..షుగర్ ఉన్నాయి. రెగ్యులర్  ఎక్సర్ సైజుల ద్వారా వాటిని నియంత్రిస్తున్నా అని  బిజినెస్ లైఫ్ లో పడి కొన్ని ఎంజాయ్ మెంట్ లు మానేసా. కొత్త ప్రదేశాలు..కొత్త విషయాలు తెలుసుకోవడం  నాకు చాలా ఇష్టం అని నాగ‌బాబు చెప్పుకొచ్చారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...