Home Film News Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ టైటిల్ మార‌నుందా..మ‌ళ్లీ ఇదేం ట్విస్ట్..!
Film News

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ టైటిల్ మార‌నుందా..మ‌ళ్లీ ఇదేం ట్విస్ట్..!

Pawan Kalyan: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది వ‌రుస సినిమాల‌తో ప‌వ‌ర్ స్టార్ సంద‌డి చేయ‌నున్నారు. అయితే ప‌వ‌న్ న‌టించిన బ్రో సినిమా విడుద‌ల‌కి సిద్ధం కాగా, ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓజీ అనే చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీలో పవన్  చాలా సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడని పవన్ పాత్ర ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుందని  స‌మాచారం. ఈ చిత్రం షూటింగ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం షూటింగ్ మాత్రం శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

చిత్రంలో పవన్ క‌ళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా, గ్యాంగ్‌ స్టర్‌ గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించ‌నున్నాడ‌ని టాక్.  ఈ మూవీ ఒక పీరియడికల్  మూవీ  1950 ప్రాంతంలో నడిచే కథగా దీన్ని ఒక ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం సినిమాకి సంబంధించి ప్ర‌త్యేక సెట్స్ ఏర్పాటు చేయ‌గా, వాటిలో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. చిత్రంంలో ఒక కీలక పాత్ర కోసం తమిళ నటుడు అర్జున్ దాస్‌ ను ఎంచుకున్నార‌ట‌..  వచ్చే సంవత్సరం సంక్రాంతికి రాబోతున్న ఈమూవీని ‘ఆర్ ఆర్ ఆర్’ తీసిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.

తాజాగా ఓజీకి  సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. ఓజీ అనేది చిత్రానికి వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే త‌ప్ప ఒరిజిన‌ల్ టైటిల్ కాద‌ని అంటున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు  టైటిల్ గా ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.ఇక మూవీకి ‘#they కాల్ హిమ్ OG ‘ అనేది క్యాప్షన్ గా ఉండ‌నుంద‌ని అంటున్నారు. మ‌రి కొత్త టైటిల్ ఏంటి, దానిని ఎప్పుడు ప్ర‌క‌టిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ప్ర‌స్తుతం వారాహి యాత్ర‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ లేకుండా ప్రధాన తారాగణం మీద మూడవ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట సుజీత్. వారాహి యాత్ర పూర్త‌య్యాక తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నాడు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...