Home Film News NTR’s Wife: పెళ్లికి ఎన్టీఆర్ స‌తీమ‌ణి క‌ట్టుకున్న చీర ధ‌ర ఎంత‌.. వారి పెళ్లికి అంత ఖ‌ర్చైందా..!
Film News

NTR’s Wife: పెళ్లికి ఎన్టీఆర్ స‌తీమ‌ణి క‌ట్టుకున్న చీర ధ‌ర ఎంత‌.. వారి పెళ్లికి అంత ఖ‌ర్చైందా..!

NTR’s Wife: తాత నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చ‌కొని సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒక‌రిగా ఎదిగారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైవిధ్య‌మైన సినిమాల‌తో స్టార్ హీరోగా ఎదిగాడు.  జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆది, స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, లాంటి ఎన్నో సినిమాలు రికార్డులు బ్రేక్ చేశాయి. ఇటీవ‌ల  రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో  ప్రేక్షుకుల‌ని ప‌ల‌క‌రించిన ఎన్టీఆర్ కొమురం భీంగా తెగ సంద‌డి చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా బంపర్ హిట్ కావడంతో పాటు ఆస్కార్ అవార్డు ద‌క్క‌డంతో జూనియ‌ర్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. ఇందులో జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఈ సినిమాపై అంచ‌నాలు మాత్రం పీక్స్ లో ఉన్నాయి. అయితే జూనియ‌ర్ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి త‌ప్ప‌క స‌మ‌యం కేటాయిస్తూ ఉంటాడు. అప్పుడ‌ప్పుడు వారితో క‌లిసి స‌ర‌దాగా షికారుల‌కి కూడా వెళుతుంటాడు. ఇక ఎన్టీఆర్ భార్య బ‌య‌ట కనిపించ‌డం చాలా త‌క్కువ‌. పెద్ద‌గా ఫంక్షన్స్ కి రాదు, అలానే సోష‌ల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా ఉండ‌దు. జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతి వివాహం 2011 సంవత్సరం మే 5న చాలా అట్ట‌హాసంగా జ‌రిగింది.

పెళ్లిలో ప్రణ‌తి క‌ట్టుకున్న చీర‌కి సంబందించిన వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ప్ర‌ణ‌తి క‌ట్టుకున్న చీర కోటి రూపాయ‌ల‌కి పైగానే ఉంటుంద‌ని స‌మాచారం. వీరి పెళ్లి జ‌రిగిన దాదాపు 12 సంవ‌త్స‌రాలు అయింది. అప్ప‌ట్లోనే ప్ర‌ణ‌తి అంత ఖ‌రీదైన చీర క‌ట్టుకోవ‌డంతో అంద‌రు అవాక్కవుతున్నారు. ఇక   జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతి వివాహం కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు  చేసార‌ని స‌మాచారం. కాగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తండ్రి ప్రముఖ బిజినెస్ మ్యాన్ నార్నే శ్రీనివాసరావు. కూతురి పెళ్లి అయితే ఓ రేంజ్లోనే జ‌రిపించారు.  ఇక ఎన్టీఆర్, ప్ర‌ణ‌తి దంపతులకు అభయ్ రామ్ మరియు భార్గవ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉండ‌గా, వారిలో చిన్న కుమారుడిని త్వ‌ర‌లో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ట్టు టాక్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...