Home Film News Pawan: ప‌వ‌న్ ఎందుకు మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు.. ఆయ‌న ఎన్ని క‌ష్టాలు ప‌డ్డాడంటే..!
Film News

Pawan: ప‌వ‌న్ ఎందుకు మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు.. ఆయ‌న ఎన్ని క‌ష్టాలు ప‌డ్డాడంటే..!

Pawan: చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అభిమానులు కాదు భ‌క్తులు ఉంటారు.ఆయ‌న సినిమాల‌పై క‌న్నా సామాజిక సేవ‌పై ఎక్కువ ఆస‌క్తి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌లోకి వెళ్లారు. ప్ర‌స్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్న విష‌యం తెలిసిందే. సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చే స‌మ‌యంలోనే ఆయన శిక్ష‌ణ తీసుకున్నాడు. మార్ష‌ల్ ఆర్ట్స్ కోసం ప‌వన్ చాలా క‌ష్ట‌ప‌డ్డ‌డు. తమిళనాడులో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు కావలసిన వ్యక్తి దగ్గరే నేర్చుకోవాలని అనుకున్నాడ‌ట‌.

అందుకోసం చాలా రోజుల పాటు ట్రైన‌ర్ చుట్టే తిరిగాడ‌ట‌. అందుకు కార‌ణం ఆ ట్రైన‌ర్   అప్పటికే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మానేసి సెక్యూరిటీ ఏజెన్సీ నడుపుకుంటూ జీవనం కొన‌సాగిస్తున్నారు. నేర్చుకుంటే అత‌ని ద‌గ్గ‌రే నేర్చుకోవాల‌ని ప‌వన్ అనుకున్నాడ‌ట‌.  అయితే తాను ఎంత చెప్పిన ప‌వ‌న్ వినక‌పోయే స‌రికి కొన్ని కండీష‌న్స్ పెట్టాడ‌ట‌.  ఉదయం 5 గంటలకే ఇంటికి రావాలని అలాగే రాత్రి 11 వరకు తనతోనే ఉండాలని, ఇక త‌న‌కు ఖాళీ ఉన్న స‌మ‌యంలో ఓ అర‌గంట మాత్ర‌మే నేర్పిస్తాన‌ని అన్నాడ‌ట‌. దానికి ఓకే చెప్పిన ప‌వ‌న్.. రోజు తెల్ల‌వారుఝామున వెళ్లి ట్రైన‌ర్ ఇంటి మందు నిలుచునేవాడ‌ట‌.

ఇక ట్రైన‌ర్‌కి టీ పెట్టి ఇవ్వడం, కరాటే నేర్చుకునే ప్రదేశాన్ని తానే  శుభ్రపరచుకోవడం వంటి పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్  చేసేవాడ‌ట‌. అయితే ముందు తాను చిరు త‌మ్ముడు అని తెలియ‌ద‌ట‌. ఎప్పుడైతే ఆ విష‌యం తెలిసిందో సీరియస్ గా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడట.అలా ఏడాది పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత బ్లాక్ బెల్ట్ అందుకున్నాడు . అయితే క‌ళ్యాణ్ కుమార్ అని అత‌ని పేరు ఉండ‌గా,  మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన ట్రైన‌ర్  పెట్టాడట.ఈ విషయాన్ని సదరు ట్రైనర్  ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియ‌జేశాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...