Home Film News ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!
Film News

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి వరకు ఒక హీరో అభిమానులు ఇంకో హీరోనీ ఎదో అనటం, ఆ అభిమానులు కూడా దానికి సమాధానం ఇవ్వటం, ఇలా ఇంతవరకు మాటలతో యుద్ధం జరిగింది, ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు దూషించుకోవటం ఎక్కువైంది. నిన్న బెంగుళూరు లో అయితే ఏకంగా అభిమానుల మధ్య ప్రత్యక్షంగా కొట్లాట జరగటం, ప్రభాస్ అభిమానిని ఒకరిని, అల్లు అర్జున్ అభిమానులు చితక బాదటంతో ఆ వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Fans feel Allu Arjun doing Prabhas' biopic, here's why

చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు అందరూ ఉత్తమ మధ్య ఎలాంటి గొడవలు విభేదాలు లేవని.. కేవలం తమ సినిమాల మధ్య పోటీలు మాత్రమే ఉంటుందని చాలాసార్లు చెప్పారు.. కొంతమంది స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అయితే బహిరంగంగానే తమ మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని, అభిమానుల మధ్య కూడా అలాంటివి ఉండకూడదని, కలిసి వుండాలని ఇద్దరూ కలిపి ఒకే వేదికపై చెప్పారు.

అయినా అభిమానుల మనస్సులో మాత్రం మార్పు రాలేదనటానికి నిన్న బెంగుళూరులో జరిగిన కొట్లాట ఒక ఉదాహరహణ. తెలుగులో నటులకి వున్నన్ని అభిమాన సంఘాలు మరెక్కడా ఉండవేమో అనికూడా అనిపిస్తూ ఉంటుంది. ఓ స్టార్ హీరో సినిమా విడుదలైనప్పుడు అయితే సామాజిక మాధ్యమాల్లో వేరే హీరోల అభిమానులు ఆ సినిమాకి నెగటివ్ ప్రచారం చెయ్యడం, లేదా సినిమా బాగోలేదు అనే వార్త వైరల్ చెయ్యడం లాంటివి ఇప్పుడు పరిపాటి అయిపోయాయి. అయితే ఇంతవరకు సామాజిక మాధ్యమాల్లో మాత్రమే ఎంతో దూకుడుగా వున్న అభిమానులు ఈసారి కొట్టుకోవటం వరకు దారితీశారు అంటే, ముందు ముందు ఈ అభిమానుల గొడవలు ఎటు దారితీస్తాయో అని పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది.

Prabhas, Allu Arjun Fans End War As Pushpa Star Consoles Baahubali Actor at Krishnam Raju's Funeral - News18

గ‌తంలో కూడా సోషల్ మీడియాల్లో అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్‌ను లాటరీ స్టార్‌గా అభివర్ణించారు. బాహుబలి సినిమాతో అదృష్టం కొద్దీ మంచి పేరు తెచ్చుకున్నాడని.. రాజమౌళి లేకపోతే ప్రభాస్ లేడని సోషల్ మీడియాలో అల్లుఅర్జున్్ అభిమానులు పలు పోస్టులు పెట్టారు. ప్రభాస్ కంటే అల్లు అర్జున్ గొప్ప‌ యాక్టర్, డ్యాన్సర్ అని కూడా అన్నారు అల్లు ఫ్యాన్స్. ఈ రీసెంట్ టైమ్స్ లో అల్లు అర్జున్ తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రియేట్ లో అందుకున్నాడని వారు పేర్కొన్నారు.. అల్లు అర్జున్ మాత్రమే నిజమైన పాన్ ఇండియా హీరో అని వాళ్ళు వ్యాఖ్యానించారు.

అయితే దీనికి ప్ర‌భాస్ అభిమానులు ధీటైన కౌంట‌ర్లు వేసారు. బాలీవుడ్‌లో అల్లు అర్జున్ సినిమాల లైఫ్ టైమ్ క్లోజింగ్ కలెక్షన్స్, ఓపెనింగ్ వీకెండ్‌లో ప్రభాస్ సినిమాలు కలెక్ట్ చేసే దానితో సమానంగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు కౌంట‌ర్లు విసిరారు. ప్రభాస్ గురించి మాట్లాడే ముందు అల్లు అర్జున్‌ అభిమానులు ముందు వారీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని.. ప్రభాస్ అభిమానులు సూచించారు. అయితే ఇప్పుడు ప్రభాస్-అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఈ వార్‌ ఎప్పుడూ హార్ట్ టాపిక్ గా ఉంటూనే వచ్చింది. అయితే ఇప్పుడు బెంగళూరులో క్రికెట్ స్టేడియం లో ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు గొడవ పడటం అందులోను ఒక అభిమానికి తీవ్ర గాయాలు అవటం సంచలనంగా మారింది.

Bangalore: ప్రభాస్ ఫ్యాన్‌ను రక్తం వచ్చేలా కొట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్...

ప్ర‌స్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ఓ క్రికెట్ గ్రౌండ్ లో ఇద్ద‌రి హీరోల అభిమానుల‌ మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. అయితే అది చినికి చినికి గాలి వానైంది. ఇక చివరికి అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్ అభిమానులపై దాడికి దిగడంతో అతనికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి.. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచారించాల‌ని ఇప్పుడు ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి నిన్న జరిగిన ఈ సంఘటనపై ప్రభాస్, అల్లు అర్జున్ లు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ మే నెలలో విడుదలకు రెడీగా ఉంది. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్నారు.. మ‌రి ఈ ఇద్ద‌రు ఎలా స్పందిస్టారో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

చిరు- బాల‌య్య కాంబోలో మిస్ అయిన మల్టీస్టారర్.. దీని వెనుక ఇంత క‌థ ఉందా..!

ఇక చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు చేస్తేనే ఎంతో బాగుంటుంది. మరికొందరు చేస్తే...