Home Film News Prabhas Fan: చేయి కోసుకొని ప్ర‌భాస్ నుదుటిన ర‌క్తం దిద్దిన వీరాభిమాని
Film News

Prabhas Fan: చేయి కోసుకొని ప్ర‌భాస్ నుదుటిన ర‌క్తం దిద్దిన వీరాభిమాని

Prabhas Fan: ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన విజువ‌ల్ వండర్ ఆదిపురుష్‌. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నించారు. సంక్రాంతికి విడుద‌ల కావ‌ల్సిన ఈ చిత్రం జూన్ 16న థియేటర్స్ లోకి వ‌చ్చింది. చిత్రంలో  ప్రభాస్ శ్రీరాముడిగా,  కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా  న‌టించి మెప్పించారు. ఆదిపురుష్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా  7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేశారు. కేవ‌లం హిందీ బెల్ట్ ఏరియాల్లో దాదాపు 3 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలై అంద‌రికి షాకిచ్చింది. రామాయణం ఇతిహాసం గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

చాలా రోజుల త‌ర్వాత ప్ర‌భాస్ నుండి సినిమా విడుద‌ల కావ‌డంతో థియేట‌ర్స్ ద‌గ్గ‌ర అభిమానుల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంది. ప్ర‌భాస్ అభిమానులు అయితే థియేటర్ దగ్గర భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, పూలతో అలంకరణతో పండుగ వాతావరణాన్ని తీసుకు వ‌చ్చారు. కొంద‌రు అభిమానులు బాణాసంచా పేల్చారు. అయితే ఇదే క్ర‌మంలో అభిమానం హద్దులు దాటేసింది.  సినిమా గురించి రివ్యూస్ చెప్పిన వాళ్ల‌కి మాస్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. థియేటర్ లో సౌండ్ సిస్టమ్స్ బాగోలేదని ఆ థియేటర్ అద్దాలు పగులగొట్ట‌డం కూడా జ‌రిగింది. సినిమా బాలేద‌న్నందుకు అభిమానులు అత‌న్ని చిత‌క్కొట్టారు. ఇక ఓ అభిమాని అయితే తన వీరాభిమానం  ప్రదర్శించే ప్రయత్నంలో అనాలోచిత చర్యకు పాల్పడ్డాడు.

సినిమా న‌చ్చింద‌న్న ఆనంద‌మో లేకుంటే ఇంకేదో కాని ఓ వీరాభిమాని ప్ర‌భాస్ క‌టౌట్ ఎదురుగా బీరు బాటిల్ ప‌గ‌ల‌గొట్టి దాంతో చేతిని ప‌రప‌రా కోసుకున్నాడు. చేతిని కోసుకోగా ర‌క్తం రాగా, జై రెబ‌ల్ స్టార్ అంటూ ఆ ర‌క్తంతో  ప్రభాస్‌కు వీర తిలకం దిద్దాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన‌ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇలాంటి  చర్యను చాలా మంది నెటిజన్లు ఖండిస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ.. ఇలా చేయోద్దు అంటూ మంద‌లిస్తున్నారు. గ‌తంలోను కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం మ‌నం చూశాం.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...