Home Film News Saidharam Tej: విషాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్.. ధైర్యం అందించిన మంచు మ‌నోజ్
Film News

Saidharam Tej: విషాదంలో సాయిధ‌ర‌మ్ తేజ్.. ధైర్యం అందించిన మంచు మ‌నోజ్

Saidharam Tej: మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండ‌రు. త‌న సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ త‌ప్ప ప‌ర్స‌న‌ల్ విష‌యాలు పెద్ద‌గా షేర్ చేయ‌డు. అయితే తాజాగా ఆయ‌న త‌న ఇన్‌స్టా ద్వారా అల్లారుముద్దుగా పెంచుకున్న పెట్ చ‌నిపోయింద‌ని చెప్పాడు. ఈ క్ర‌మంలో కాస్త ఎమోష‌న‌ల్ కూడా అయ్యాడు. తేజ్ పెట్ పేరు టాంగో కాగా, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూసింద‌ట‌. “టాంగో, నిన్ను  ఎప్పుడు త‌ల‌చుకున్నా కూడా  నా మనసు చాలా తేలికగా, హ్యాపీగా ఉంటుంది. నువ్వు లేవు అనే విషయాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను.

నన్ను నువ్వు ఎన్నోసార్లు కాపాడావు. బాధల్లో ఉన్నప్పుడు కూడా ఓదార్పు ఇచ్చావు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా నవ్వించావు. నా కష్టసుఖాల్లో తోడుగా ఉన్నావు. నువ్వు నాతో ఉన్న క్షణాలు ఎంతో మ‌ధుర‌మైన‌వి. నాకు నీ నుంచి ఎంతో ప్రేమ లభించింది. నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న‌ అదృష్టం. నా దగ్గరికి వచ్చిన తొలి రోజు నుండి నేటి వరకు ఎన్నో జ్ఞాపకాలు నీతో ఉన్నాయి. లవ్ యు మై బండ ఫెలో, టాంగో” అంటూ  సాయి ధ‌ర‌మ్ తేజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన లేఖ‌లో పేర్కొన్నాడు. తేజ్ పోస్ట్‌కి మంచు మ‌నోజ్ స్పందిస్తూ.. ధైర్యంగా ఉండాల‌ని అన్నాడు.  కొందరు సినీ నటీనటులతో పాటు అభిమానులు కూడా తేజ్‌ని ధైర్యంగా ఉండాల‌ని కోరుతున్నారు.

ఇక చివరిగా విరూపాక్ష చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన సాయి ధ‌ర‌మ్ తేజ్ రీసెంట్‌గా త‌న మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి బ్రో అనే చిత్రం చేశాడు.  స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 28న  ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలోసాయి ధరమ్ తేజ్ సరసన ‘రొమాంటిక్’ కథానాయిక కేతికా శర్మ న‌టించింది. ఇక వింక్ భామ  ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది చిత్రం ప్ర‌ధాన కాన్సెప్ట్‌గా తెలుస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోడ్ర‌న్ గాడ్‌గా చిత్రంలో క‌నిపించ‌నున్నారు. ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం ప‌లు క‌థ‌లు వింటుండ‌గా, త్వ‌ర‌లో త‌న సోలో మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వనున్నాడు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...