Home Film News Varun Tej-Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లో ఈ విష‌యం గ‌మ‌నించారా..!
Film News

Varun Tej-Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లో ఈ విష‌యం గ‌మ‌నించారా..!

Varun Tej-Lavanya Tripathi: నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఐదేళ్ల క్రితం లావ‌ణ్య త్రిపాఠితో ప్రేమ‌లో ప‌డి ఈ ఏడాది జూన్ 9న ఆమెతో నిశ్చితార్థం జ‌రుపుకున్నాడు. ఏడాది చివ‌రలో పెళ్లి చేసుకోనున్నాడు. ప్రైవేట్ వేడుక‌గా జ‌రిగిన‌ నిశ్చితార్థానికి మెగా, అల్లు, లావణ్య కుటుంబాలు మాత్రమే హాజరు అయ్యారు. ఎనిమిది గంట‌ల‌కి వేడుక మొద‌లు కాగా, దాదాపు అంద‌రు కూడా అదే స‌మ‌యానికి హాజ‌రయ్యారు. అయితే ప‌వన్ క‌ళ్యాణ్ ఇత‌ర కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ప‌ది గంట‌ల‌కి నాగ‌బాబు ఇల్లు చేరుకున్నారు. ఇప్పటికే వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ వేడుక‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజ‌న్స్ ఓ ఆస‌క్తిక‌రమైన విష‌యం గ‌మ‌నించారు.

వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక‌లో సింగిల్స్ హ‌వా ఎక్కువ‌గా కనిపించింది.  రామ్ చరణ్, ఉపాసన జంట‌గా క‌లిసి రాగా, అల్లు అర్జున్-స్నేహారెడ్డి ,  చిరంజీవి-సురేఖలు మాత్ర‌మే త‌న స‌తీమ‌ణుల‌తో హాజ‌ర‌య్యారు. మిగ‌తా వారెవ‌రు కూడా ఫ్యామిలీతో కాకుండా సోలోగా సంద‌డి చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స‌తీమ‌ణితో కాకుండా సోలోగానే వ‌చ్చాడు. ఇక కొద్ది రోజులుగా నిహారిక‌, శ్రీజ విడాకుల అంశం టాలీవుడ్‌లో ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దీనిపై ఎవ‌రికి పెద్ద‌గా క్లారిటీ లేక‌పోయిన‌ప్ప‌టికీ వ‌రుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

సొంత కుటుంబ స‌భ్యుల వేడుక‌లో నిహారిక భ‌ర్త‌, శ్రీజ భ‌ర్త క‌నిపించ‌క‌పోవ‌డంతో అంద‌రు అంచ‌నాకి వ‌చ్చేశారు. అయితే వేడుక‌లో నిహారిక‌, శ్రీజ సింగిల్‌గానే సంద‌డి చేయ‌డం విశేషం. ఇక  వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ ఓ రేంజ్ లో సందడి చేసారు. వీళ్లకు సాయిధరమ్ తేజ్ కూడా తోడయ్యాడు. అల్లు అర‌వింద్ కూడా త‌న స‌తీమ‌ణితో కాకుండా సింగిల్‌గా వ‌చ్చిన‌ట్టు టాక్. ఏదేమైన ఈ వేడుక‌లో ఫ్యామిలీ క‌న్నా సోలో సంద‌డి ఎక్కువ‌గా క‌నిపించింది. ఇక ఇదిలా ఉంటే .. నిహారిక-లావణ్య త్రిపాఠి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విష‌యం  తెలిసిందే. ఎంగేజ్ మెంట్ తర్వాత లావణ్య త్రిపాఠిని వదిన అంటూ సంబోధిస్తూ నిహారిక ఓ ట్వీట్ చేసింది. వీరిద్ద‌రికి జిమ్‌లో మంచి స్నేహం ఏర్ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...