Home Film News Mokshagna: బాల‌య్య త‌న‌యుడు ఇంత స్లిమ్‌గా మారాడు.. కేక పెట్టిస్తున్న మోక్ష‌జ్ఞ న్యూ లుక్
Film News

Mokshagna: బాల‌య్య త‌న‌యుడు ఇంత స్లిమ్‌గా మారాడు.. కేక పెట్టిస్తున్న మోక్ష‌జ్ఞ న్యూ లుక్

Mokshagna: ప్ర‌స్తుతం నంద‌మూరి ఫ్యామిలీలో బాల‌కృష్ణ‌, జూనియర్ ఎన్టీఆర్ త‌ప్ప సక్సెస్ ఫుల్ కెరీర్ సాగిస్తున్న వారు లేరు. వీరిద్దరు మాత్ర‌మే మంచి విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ఇక నంద‌మూరి ఫ్యామిలీ నుండి మ‌రో హీరో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని కొన్నాళ్లుగా ఒకటే వార్త‌లు వ‌స్తున్నాయి. అత‌డు మ‌రెవ‌రో కాదు బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ. ఓ సంద‌ర్భంగా బాల‌కృష్ణ కూడా త‌న త‌న‌యుడి ఆరంగేట్రం త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని తెలియ‌జేశాడు. అయితే ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీకి ఎంత స‌మ‌యం లేదు.  తాజాగా మోక్షజ్ఞ లుక్‌ చూసి అందరూ  షాక్ అయిపోతున్నారు. ఒకప్పుడు చాలా లావుగా ఉండే  మోక్షజ్ఞ.. ఇప్పుడు స్లిమ్ గా, హీరో అంటే ఇలా ఉండాలి అనేంతలా మారిపోయి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

మొన్న‌టి వ‌ర‌కు చాలా బొద్దుగా ఉన్న మోక్ష‌జ్ఞ ఒక్కసారిగా ఇంత‌లా ఎలా సన్న‌బ‌డిపోయాడు అని అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ఇంత షార్ట్ టైంలో ఇలా సన్న‌బ‌డ్డాడంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ మాదిరిగా బేరియాట్రిక్ స‌ర్జరీ చేయించుకున్నార‌ని అంటున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ..రాఖీ సినిమా వ‌ర‌కు చాలా లావుగా క‌నిపించేవాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన య‌మ‌దొంగ సినిమాలో మాత్రం చాలా స్లిమ్‌గా క‌నిపించాడు. ఎన్టీఆర్  బేరియాట్రిక్ స‌ర్జ‌రీ చేయించుకొని అంత స‌న్న‌గా మార‌గా, ఇప్పుడు మోక్ష‌జ్ఞ కూడా అదే స‌ర్జరీ చేయించుకొని ఉంటాడ‌ని భావిస్తున్నారు.

ఏదైతేనేం నంద‌మూరి వారి నెక్ట్స త‌రం వార‌సుడు  హీరో పీస్ మాదిరిగా మారే సరికి త్వ‌ర‌లోనే సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.  బాలయ్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిన ఆదిత్య369 సినిమా సీక్వెల్ చిత్రం ద్వారా బాల‌య్య త‌న‌యుడి డెబ్యూ ఉంటుంద‌ని టాక్. ఈ  సినిమాకి బాలయ్యనే స్వయంగా దర్శకత్వం వహించనున్న‌ట్టు కూడా తెలుస్తుంది.. మ‌రి చిత్రానికి  నిర్మాత‌లు ఎవ‌రు?క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేస్తారు వంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు దొర‌కాలంటే మాత్రం మ‌రికొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు మ‌రి. ఇక బాల‌య్య విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న 108మూవీ భ‌గ‌వంత్ కేస‌రి నుంచి ఇటీవ‌ల టీజ‌ర్ కూడా వ‌చ్చేసింది. అందులో బాల‌కృష్ణ స్టైల్‌, యాక్ష‌న్‌, మాస్ విధ్వంసానికి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. ఇక ఇటీవ‌ల  NBK 109ను కూడా లాంఛ‌నంగా ప్రారంభించారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...