Home Film News Sitara: ఒక్క యాడ్ కోసం మ‌హేష్ కూతురు అన్ని కోట్లు తీసుకుందా..!
Film News

Sitara: ఒక్క యాడ్ కోసం మ‌హేష్ కూతురు అన్ని కోట్లు తీసుకుందా..!

Sitara: కూతురు లేదా కొడుకు  పుట్టిన‌ప్పుడు కాదు.. వారు ప్ర‌యోజ‌కులైన‌ప్పుడు తండ్రికి అస‌లైన ఆనందం ఉంటుంది. అయితే మ‌హేష్ బాబు ముద్దుల త‌న‌య సితార  చిన్న‌ప్ప‌టి నుండే త‌న తండ్రి గ‌ర్వ‌ప‌డేలా చేస్తుంది. త‌న‌లోని హిడెన్ టాలెంట్ బ‌య‌ట‌కు తీస్తూ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ప్ర‌స్తుతం స్కూలింగ్ చేస్తున్న సితార సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ  ప‌లు వీడియోలు షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. ముఖ్యంగా త‌న తండ్రి సినిమాలోని పాట‌లు పాడ‌డం లేదంటే ఆ పాట‌ల‌కి డ్యాన్స్ చేసి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల‌కి మంచి కిక్ ఇస్తుంటుంది. అయితే సితార తాజాగా అరుదైన ఫీట్ సాధించింది.

చిన్న వయస్సులోనే అతిపెద్ద జ్యూవెల్లరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా మారి అరుదైన ఘనత త‌న ఖాతాలో వేసుకుంది. ఇంటర్నేషనల్ జ్యూవెల్లరీ పీఎంజే జ్యూవెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైన సితార ఇటీవ‌ల ఫొటో షూట్ కూడా చేసింది. అయితే అమెరికాలోని టైమ్స్ స్వ్కైర్‌పై సితార‌ జ్యూవెల్లరీ యాడ్‌ని  ప్రదర్శించడంతో న‌మ్ర‌త‌, మ‌హేష్ బాబుల ఆనందం అంతా ఇంతా కాదు.  చిన్న వయసులో అంతటి అరుదైన ఘనత సాధించిన స్టార్‌ కిడ్‌గా సితార రికార్డ్ సృష్టించింది.ఇక తాజాగా సితార ఈ యాడ్ కోసం ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌నే విష‌యం బ‌య‌ట‌కు వచ్చింది.

చిన్న వ‌య‌స్సులోనే సితార ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డంతో ఒక్కొక్క‌రికి ప్యూజులు ఎగిరిపోతున్నాయి. యాడ్‌ కోసం సితారకి ఏకంగా రూ.కోటి రెమ్యున‌రేషన్ ఇచ్చార‌ని టాక్ . ఇది నమ్మడానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా  ఇదే నిజమని తెలుస్తుంది. అంతటి రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డం వల్లే మహేష్‌.. సితార ఈ యాడ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. గ‌తంలో సితార‌కి ఇలానే ప‌లు యాడ్స్ కి సంబంధించిన ఆఫ‌ర్స్ రాగా, వాట‌న్నింటిని రిజెక్ట్ చేశార‌ట‌. ఈ జ్యువెల‌రీ యాడ్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డానికి కార‌ణం కేవ‌లం రెమ్యున‌రేషన్ అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఇక మ‌హేష్ బాబు కూడా యాడ్స్ ద్వారా సినిమాల‌కి మించిన రెమ్యున‌రేష‌న్‌ని సంపాదిస్తున్న విష‌యం తెలిసిందే.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...