Home Film News Kaduva : పాన్ ఇండియా స్థాయిలో పృథ్వీరాజ్ ‘కడువా’
Film News

Kaduva : పాన్ ఇండియా స్థాయిలో పృథ్వీరాజ్ ‘కడువా’

Kaduva
Kaduva

Kaduva: టాలెంటెడ్ మలయాళీ యాక్టర్, రైటర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ‘కడువా’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు. మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుందీ చిత్రం.

ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్నారు.. మలయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేసిన షాజీ కైలాష్.. తెలుగులో మంచు విష్ణు ఫస్ట్ ఫిలిం ‘విష్ణు’ డైరెక్ట్ చేశారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటోంది.

సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ‘సార్’ లోనూ నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నన్నారు. మోహన్ లాల్ ‘లూసీఫర్’ తో దర్శకుడిగా కూడా ఆకట్టుకున్న పృథ్వీరాజ్ ‘కడువా’ తో ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...