Home Film News గుంటూరు కారం రివ్యూ : సినిమా అంతా మహేష్.. ఫ్యాన్స్ కు మాత్రమే..!
Film NewsReviews

గుంటూరు కారం రివ్యూ : సినిమా అంతా మహేష్.. ఫ్యాన్స్ కు మాత్రమే..!

టైటిల్‌: గుంటూరు కారం
నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జయరాం, మురళి శర్మ, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్
సంగీతం: ఎస్ థమన్
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
విడుదల తేదీ : జనవరి 12

FL ప‌రిచ‌యం :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు 14 సంవత్సరాల తర్వాత గుంటూరు కారం సినిమా రూపంలో అవకాశం మళ్ళీ వచ్చింది. వీరిద్దరి కలయికలు వచ్చిన మూడో సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీ లీలా మీనాక్షి చౌదరి, హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కనుక ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించిందో ఇక్కడ చూద్దాం.

మూవీ రివ్యూ : గుంటూరు కారం | Guntur karam Movie Review

క‌థ‌ :
వెంకటస్వామి(ప్రకాష్ రాజ్) ఒక పెద్ద రాజకీయ నాయకుడు అతని కూతురు వసుంధర (రమ్యకృష్ణ) కూడా రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంది. వసుంధర కి మొదట సత్యం(జయరాం) తో వివాహం జరుగుతుంది.. వీరిద్దరికీ పుట్టిన కొడుకే రమణ (మహేష్ బాబు)… అదే సమయంలో ఆ ఊరిలో గొడవలు జరగటం అందులో వసుంధర భర్త ఉండటంతో భర్తని కొడుకుని గుంటూరులో వదిలేసి హైదరాబాదులో ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్లిపోతుంది వసుంధర.. అక్కడే నారాయణని (రావు రమేష్) రెండో పెళ్లి చేసుకుంటుంది.. వీరికి రాజగోపాల్ (రాహుల్ రవీంద్రన్) అనే కుమారుడు కూడా పుడతాడు.. వసుంధర తండ్రి వెంకట్ స్వామి తన నిజమైన వారసుడు రాజగోపాల్‌ని చెప్పుకుంటూ అతనిని కూడా ఎన్నికల్లో పోటీ చేయించడానికి రెడీ చేస్తూ ఉంటాడు.

అయితే మొదటి వారసుడు రమణని హైదరాబాద్‌కు పిలిపించుకొని తనకి ఆస్తి అవసరం లేదు అని వసుంధరకి తనకి సంబంధం లేదని ఓ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టమని చెబుతూ ఉంటాడు. అయితే తన లాయర్ వకీలు పాణి(మురళి శర్మ) రమణతో ఎలా అయినా సంతకం పెట్టిస్తానని చెప్పి తన కూతురు అమ్ములు (శ్రీలీల)ని గుంటూరుకు పంపిస్తాడు. అమ్ములు గుంటూరు వెళుతుంది.. కానీ ఆమె అదే సమయంలో రమణాతో ప్రేమలో పడుతుంది. ఇంతకీ రమణ సంతకం పెట్టాడా? రమణకి తల్లి వసుంధర అంటే ఎందుకు కోపం? వెంకటస్వామి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎటువంటి రాజకీయ ఎత్తులు వేశాడు.?. చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే గుంటూరు కారం సినిమా చూడాల్సిందే.

Guntur Kaaram Review: రివ్యూ: గుంటూరు కారం.. మహేశ్‌-త్రివిక్రమ్‌ మేజిక్‌ రిపీట్‌ అయిందా? | mahesh babu guntur karam movie review in telugu

విశ్లేషణ:
అతడు సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వకపోవచ్చు కానీ అది ఎన్నిసార్లు చూసినా ఎవరికి బోర్ కొట్టదు.. అలాగే ఖ‌లేజా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యుండొచ్చు కానీ ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇది మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఉన్న గత చరిత్ర. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఎంతో ఇష్టపడి- కష్టపడి ఒక తపనతో చేసిన సినిమాలకు సరైన ఫలితం రాలేదని ఇద్దరు ఏమైనా ప్రేక్షకుల మీద అలిగారు ఏమో తెలియదు కానీ ఈసారి గుంటూరు కారం అనే సగటు కమర్షియల్ సినిమాను తీసుకొచ్చారు. ఈ సినిమాకు గుంటూరు కారం లాంటి రొటీన్ టైటిల్ ఎలా పెట్ట‌రో.. మ‌హేష్‌ ఏంటి ప్రతి పోస్టర్లోనూ బీడీతోనే కనిపిస్తున్నాడు.. త్రివిక్రమ్ ఈ సినిమాలో కూర్చి మడతపెట్టి లాంటి లిరిక్స్ ఎందుకు తీసుకున్నాడు.. మేకింగ్ దశలో ఇలాంటి ప్రశ్నలు వేసుకున్న వాళ్ళందరికీ తేరమేద బొమ్మ చూశాక విషయం అర్థమవుతుంది.. పిండి కొద్ది రొట్టి అన్నట్టు సినిమాలో ఉన్న కంటెంట్ కు తగ్గట్లే అన్ని అలా కుదిరాయి అని తెలుస్తుంది. మహేష్ -త్రివిక్రమ్ కాంబో అనగానే హిస్టరీలోకి వెళ్లి ఏదేదో ఊహించుకోకుండా సగటు కమర్షియల్ సినిమాకు ప్రిపేర్ ఐ గుంటూరు కారం సినిమాకు వెళితే ఓకే అనిపిస్తుంది. అంతకుమించి ఆశిస్తే మాత్రం ఈ సినిమా కష్టం.

ఓ గొప్ప పని మొదలు పెట్టాలని ప్రయత్నించి మధ్యలోనే ఫెయిల్ అయితే.. ఆ తర్వాత ఎందుకొచ్చినిన ప్రయోగాలు సింపుల్గా అలవాటైన ఒకే ఫార్ములాతో చక్చక చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్న చందాగా తయారైంది గుంటూరు కారం పరిస్థితి. ఉప్మా తిన్న కడుపు నిండింది కానీ ఆ టేస్ట్ గురించి ఎవరు గొప్పగా చెప్పుకోరు. అలాగే రెండున్నర గంటల్లో ఏదో అలా టైంపాస్ అయితే చేయిస్తుంది గుంటూరు కారం. కానీ షో అవ్వగానే ఏముంది ఇందులో అని మనకి అనిపిస్తుంది. త్రివిక్రమ్ ఇప్పటికే తీసిన అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో, అజ్ఞాతవాసి సినిమాలోని ఫ్యామిలీ డ్రామాని ఇటు అటు తిప్పి గుంటూరు కారం తీసినట్టు అందరికీీ అర్థమవుతుంది తప్ప ఇందులో ఓ కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. తేర‌మేది కనిపించే పెద్ద పెద్ద పాత్రలు విజువల్స్ మాటలు ఇలా అన్నీ ప్రతి సినిమాలోనూ విన్నట్టు అనిపించాయంటే త్రివిక్రమ్ మిక్సీకి ఎక్కువ పని పెట్టేసాడని చెప్పవచ్చు.

Guntur kaaram Twitter Review : మాస్ ర్యాంపేజ్.. గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ.. - Telugu News | Mahesh babu guntur karam movie twitter review | TV9 Telugu

అయితే రోజు చూసిన సీన్లే చూస్తున్న ఎంటర్టైన్మెంట్లో మాత్రం త్రివిక్రమ్ ఏమి తక్కువ చేయలేదు. మహేష్ ను అభిమానులు కోరుకునే ఎనర్జిటిక్ ఎంటర్టైనింగ్ పాత్రలో చూపించి దానికి తన మార్కు వెతకారం జోడించాడు.. ఇదే సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ గా అయిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా మొదటి భాగం వరకు మహేష్ షో కనిపించగా త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ బాగానే వర్కౌట్ అయ్యాయి మధ్యలో విధ్వంసం చూపిస్తా అన్న ప్రకాష్ రాజ్‌కు ఆ పదానికి అర్థం ఏమిటో తెలియజెప్పే ఆరంభ సన్నివేశంతో గుంటూరు కారం బాగా టేక్ ఆఫ్ అయింది. క‌థ‌పరంగా అంతే ఎంగేజింగ్ గా లేకపోయినా మహేష్ శ్రీలీల వెన్నెల కిషోర్ కాంబినేషన్లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఇక హీరో ఎలివేషన్లు పాటలు ఫైట్ లు కూడా ఓకే అనిపిస్తాయి.

మొదటి భాగం అయ్యేవరకు గుంటూరు కారం పైసా వసూల్ సినిమాగా అనిపిస్తుంది. కానీ అసలు కథ చెప్పాల్సిన రెండో భాగం లో మాత్రం త్రివేక్రమ్‌ బాగా నిరాశపరిచాడు. తల్లి కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్‌ను సరిగా పండించలేకపోయాడు.. మహేష్- రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తుంటే ప్రేక్షకులకు పరమ బోరింగ్ అనిపిస్తాయి. క్యారెక్టర్లు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళటం హైదరాబాద్ నుంచి గుంటూరు రావడం ఇదేనా సినిమా అని అనిపిస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లు ఇరికించి పెట్టి వారితో యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు పరమ విసుగు పుట్టిస్తాయి. పూర్తిగా ఆ ఎపిసోడ్ సినిమాకి డీవియేషన్లలా అనిపించే ఆ ఎపిసోడ్లు సినిమాను సీరియస్గా తీసుకోలేని పరిస్థితికి తెచ్చాయి. ఇక స్టోరీ పట్ల నెమ్మదిగా ఆసక్తి పెరుగుతుంది కథలో కాన్సెప్ట్ ఏంటో తెలిశాక మహేష్- త్రి విక్రమ్ కలిసి చేయాల్సిన సినిమానా ఇది అని అనిపిస్తుంది. ఈ మాత్రం కథకు ఇంత పెద్దసెటప్పా అన్న‌ ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇక కుర్చీ మడత పెట్టే పాట క్లైమాక్స్లో చిన్న ట్విస్టు, కొన్ని డైలాగులు తప్పిస్తే సెకండ్ పార్ట్ లో మెరుపులు పెద్దగా లేవు. మహేష్ ఫ్యాక్టర్ కమర్షియల్ హంగుల వల్ల సినిమా అలా అలా నడిచిపోయింది కానీ మహేష్- త్రివిక్రమ్ లాంటి దర్శకుడుతో..త్రివిక్రమ్- మహేష్ లాంటి హీరోతో చేయాల్సిన సినిమా మాత్రం ఇది కాదు.

Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే - Telugu News | Fans are eagerly waiting for the second song update from Mahesh Babu Guntur Karam movie | TV9 ...

నటీనటులు:
ఇక నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు సినిమాలో ఈమధ్యకాలంలో మొదటిసారి బాగా డాన్సులు బాగా చేసాడు. సినిమా అంతా మహేష్ తన భుజాలమీద వేసుకున్నాడు. కామెడీ, భావోద్వేగాలు, డాన్సులు, పోరాట సన్నివేశాలు, ఒకటేంటి అన్నీ చాలా బాగా చేసి అంతా తానే అయ్యి సినిమాలో కనిపిస్తాడు. శ్రీలీల డాన్సులు అదరగొట్టింది, అలాగే ఆమె నటన కూడా బాగుంది. ఒక తెలుగు అమ్మాయి కథానాయకురాలిగా చూడటం బాగుంది. మీనాక్షి చౌదరి అతిధి పాత్రలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ కి చాలా కాలం తరువాత మళ్ళీ ఒక మంచి పాత్ర వచ్చింది, అతనికి ఇలాంటివి కొట్టిన పిండి, అందుకని చేసుకుపోయాడు. రమ్య కృష్ణ మహేష్ బాబు తల్లిగా చాలా బాగా చేసింది. ఆమెకి కూడా క్లైమాక్స్ లో మంచి మాటలు రాయటమే కాకుండా, ఆమె నటనలో ఆమె అనుభవం కనపడుతుంది. ఇక మురళి శర్మ లాయర్ గా కనపడతాడు, అతనికి ఇది రెగ్యులర్ పాత్ర. వెన్నెల కిశోర్ ఈ సినిమాలో చాలా సేపు కనపడతాడు, అలాగే నవ్విస్తాడు కూడా. రావు రమేష్ అక్కడక్కడా కనపడినా, క్లైమాక్స్ లో మాత్రం ఒక్కసారిగా మెరుస్తాడు. ప్రకాష్ రాజ్ తో అతను చెప్పే ఆ రెండు సన్నివేశాలు క్లైమాక్స్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు. అతను డైలాగ్స్ చెపుతుంటే ప్రేక్షకులు నిశ్శబ్దంగా వింటూ వుంటారు. అది అతనిలో వున్న ఒక మేజిక్ అని చెప్పాలి. బ్రహ్మాజీ పోలీసు ఇనస్పెక్టర్ గా బాగా చేశారు. ఈశ్వరి రావుకి ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది, ఆమె హుందాగా నటించి మెప్పించింది. అజయ్, అజయ్ ఘోష్, రాహుల్ రవీంద్రన్ ఇంకా మిగతా అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

Guntur Karaam : "గుంటూరు కారం" సినిమాను మిస్ చేసుకున్న ఇద్దరు టాలీవుడ్ హీరోలు ?

చివరగా:
‘గుంటూరు కారం’లో మమకారం లేదు… హీరో నటనలో ఘాటు తప్ప! మహేష్ బాబు ఎనర్జీ, ఆ మాస్ క్యారెక్టరైజేషన్ సూపర్! మిర్చిలో ఘాటు డ్యాన్సుల్లో చూపించారు. అయితే, త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది. ఒక్క సీనులోనూ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. కామెడీ అనుకున్నంత లేదు. హై ఇచ్చే మూమెంట్స్ అసలే లేవు. మహేష్ బాబు వీరాభిమానులను సైతం డిజప్పాయింట్ చేసే చిత్రమిది.

ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే FL రేటింగ్: 2.25

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...