Home Film News Saidharam Tej: ఆ అమ్మాయి వ‌ల‌న సూసైడ్ చేసుకోవాల‌నుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్.. కాపాడింది ఎవ‌రు?
Film News

Saidharam Tej: ఆ అమ్మాయి వ‌ల‌న సూసైడ్ చేసుకోవాల‌నుకున్న సాయిధ‌ర‌మ్ తేజ్.. కాపాడింది ఎవ‌రు?

Saidharam Tej: ప్ర‌తి ఒక్క‌రి జీవితాల‌లో కూడా కొన్ని చేదు జ్ఞాప‌కాలు ఉంటాయి. అవి ఏదో ఒక సంద‌ర్భంలో బ‌య‌ట‌పెడుతూనే ఉంటారు. తాజాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ బ్రో మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా తాను ఒక అమ్మాయి వ‌ల‌న సూసైడ్ చేసుకోవాల‌న‌ని అనుకున్నాను అని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చారు. సినిమాల‌లోకి రాక‌ముందు సాయిధ‌ర‌మ్ తేజ్ ఓ అమ్మాయి తో పీకల్లోతు ప్రేమలో పడ్డారట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని భావించ‌గా,  ఇంట్లో వాళ్ళు అమ్మాయిని పోషించాలంటే ఏదైనా జాబ్ ఉండాలి కదా అని చెప్పార‌ట‌. దాంతో తేజ్ జాబ్ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా,   ఆయన ప్రియురాలు మాత్రం ఇంట్లో బలవంతం వల్ల తల్లిదండ్రుల మాట కాదనలేక ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందట.

అప్పుడు ఆ అమ్మాయిని మ‌ర‌చిపోలేని సాయిధ‌ర‌మ్ తేజ్ హృద‌యం క‌కావిక‌లంగా మారింద‌ట‌. ఆ అమ్మాయిని మ‌ర‌చిపోలేక   సూసైడ్ కూడా  చేసుకోవాలి అనుకున్నారట. ఈ విష‌యం పవన్ కళ్యాణ్ కి తెలియ‌డంతో ఆయ‌న జోక్యం చేసుకొని సాయి ధ‌రమ్ తేజ్‌ని సినిమాల్లోకి వ‌చ్చేలా చేసి ఇప్పుడు ఆయ‌న సంతోషంగా ఉండేలా చేశారు. తేజ్‌కి యాక్సిడెంట్ జ‌రిగిన స‌మ‌యంలో కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. తేజ్ ద‌గ్గ‌రే ఉంటూ ఆయ‌న‌కి ప్ర‌త్యేక వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు.  తేజ్ కోలుకోవ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సంతోషించారు.ఇక ఇప్పుడు ప‌వ‌న్, తేజ్ ఇద్ద‌రు క‌లిసి బ్రో అనే సినిమా చేశారు.

త‌మిళ హిట్ మూవీకి రీమేక్‌గా రూపొందిన చిత్రం   క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడ‌ట . ఇంట్లోని స‌మ‌స్య‌లు,   ఇలా అన్ని బాధలు తట్టుకోలేక సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడట. అప్పుడు పవన్ క‌ళ్యాణ్  దేవుడిలా వ‌చ్చి క‌థ‌ను మలుపు తిప్పబోతున్నాడు అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అంతేకాదు ఈ సినిమా ద్వారా నేటి యువతకి పవన్ కళ్యాణ్ ఓ మెసేజ్ కూడా ఇవ్వ‌నున్నార‌డ‌ట‌.  క్లైమాక్స్ సీన్ అయితే  చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుందని .. పవన్ కళ్యాణ్ సైతం సాయిధరమ్ తేజ్ సూసైడ్ చేసుకున్న సన్నివేశం చూసి చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడ‌ని ఇన్‌సైడ్ టాక్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...