Home Film News ‘ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఉండడానికే’ – ‘మా’ మెంబర్షిప్ పై ఒక ఆర్టిస్ట్ స్పందన
Film News

‘ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఉండడానికే’ – ‘మా’ మెంబర్షిప్ పై ఒక ఆర్టిస్ట్ స్పందన

Rekha Bhoj on MAA Membership

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో 900 మంది మెంబర్స్ మాత్రమే ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంధర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న సెలబ్రిటీలే చెప్తున్నారు. మాది చాలా చిన్న గ్రూప్.. మా ఎన్నికలని అనవసరంగా హల్ చల్ చేయకండి తరహా రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఐతే, కొన్ని వేల మంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కేవలం కొన్ని వందల మంది బాగోగుల కోసమే ఈ తరహా సంఘాలు ఏర్పాటు చేసి.. ఇప్పటికే సినిమాల ద్వారా సెటిల్ అయిపోయిన వాళ్ళకి ఇంకేం సేవలు చేస్తారు తరహా సందేహాలు సామాన్యులకి రావచ్చు. కచ్చితంగా మనం అనుకుంటున్నట్లే ఒక చిన్న నటి ఈ విషయాన్ని తెరమీదకి తీసుకువచ్చింది.

ఆమె పేరే రేఖ బోజ్. వైజాగ్ కి చెందిన ఈమె తన సోషల్ మీడియా పేజ్ లో కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ప్రస్తావించింది. ప్రకాష్ రాజ్, మనోజ్, హేమ, జీవిత వంటి పోటీకి నిలబడుతున్న వ్యక్తులని టాగ్ చేసి తన గోడు వెళ్లబోసుకుంది. ఇప్పటిదాకా మా టీం లో కేవలం కొద్దిమంది మాత్రమే ఉండేలా చూసుకోవడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విషయం అని పేర్కొంది ఈ అమ్మాయి.

మా లో సభ్యత్వం తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి అనేది ఆమె వాదన. ముఖ్యంగా రెండు అంశాలని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

  1. మా లో మెంబర్షిప్ తీసుకోవాలి అంటే కనీసం మూడు సినిమాల్లో డైలాగ్ లతో కూడిన పాత్రను చేసి ఉండాలి.

ఈ ఒక్క రూల్ చాలు వేలమంది ఆర్టిస్ట్ ల లెక్కలోకి రాకుండా పోతారు అనేది ఆమె పాయింట్. ఎందుకంటే అందరికీ అవకాశాలు రావు. అదే పనిగా అవకాశాలు చేజిక్కించుకునే వాళ్ళు కూడా అప్పటికే మంచి నేపథ్యం ఉన్నవాళ్ళు అయి ఉంటారు. ఇంకా చెప్పాలంటే, కొత్త వాళ్ళు.. మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు.. ఇలా డైలాగ్ లతో కూడిన మూడు సినిమాలు చేసి ఉండడం అనేది అరుదు. ఇది టాలెంట్ కన్నా, అవకాశాలకి సంబంధించిన విషయం. అలాగే పూర్తిగా సినిమా కోసమే ఇండస్ట్రీలో ఆఫీస్ ల చుట్టూ కేవలం మూడు డైలాగ్ లు ఉన్న సినిమాలు చేయలేదు కాబట్టి ఆర్టిస్ట్ ల లెక్కలోకి రాకుండా పోతారు. సినిమానే జీవితంగా బ్రతుకుతున్నా తమ బాగోగులు చూసేవాళ్ళు ఎవరూ ఉండరు అనేది ఆమె లేవనెత్తిన పాయింట్.

  1. ఇక ఆ అమ్మాయి లేవనెత్తిన రెండో పాయింట్. సభ్యత్వం కోసం లక్ష రూపాయలు కట్టాల్సి రావడం. ఇది కూడా ఉద్దేశపూర్వకంగా ఎక్కువగా పెట్టారు అనేది ఆ అమ్మాయి ప్రస్తావిస్తున్న విషయం. ఎందుకంటే, ఒక ఆర్టిస్ట్ అదృష్టం బాగుండి మంచి అవకాశాలు దొరికి మూడు కన్నా ఎక్కువే డైలాగ్స్ ఉన్న రోల్స్ చేసినా వాళ్ళకి ‘మా’ లో చేరే అవకాశం లేదు. ఎందుకంటే, ఇలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ డబ్బేమీ రాదు. తనే స్వయంగా నాలుగు సినిమాల్లో చేసినప్పటికీ ఆ వచ్చిన డబ్బులు తన ఖర్చులకే సరిపోలేదని ఇక లక్ష రూపాయలు కట్టి సభ్యత్వం ఎలా తీసుకుంటానని రాసుకొచ్చింది.

ఆమె వెలిబుచ్చిన ఈ రెండు పాయింట్లు జనాలని ఆలోచింపజేస్తున్నాయి. ఇంకా సినిమా పూర్తవడానికి ఎంతో కష్టపడే వాళ్ళందరికి కూడా ఈ ‘మా’, సినీ బిడ్డలం అని చెప్పుకుంటూ సెలబ్రిటీలు చేస్తున్న డ్రామాలో వాళ్ళకు ఎలాంటి పార్టిసిపేషన్ లేదు. ఇలాంటి కోణాల్లో చూసినపుడు మా అనే సంఘం నిజంగానే ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ళలో వాళ్ళే అహం కోసం చేసుకుంటున్న రాజకీయాలు తప్ప నిజంగా సినిమాని గ్రౌండ్ లెవెల్లో నిర్మించే సినీ కార్మికులకి ఈ మా అసోసియేషన్ ఏ మాత్రం సంబంధం లేనిది. ఆమె లాంటి వ్యక్తులు మరికొంత మంది ముందుకు వచ్చి మాట్లాడాలి అని అనుకున్నా.. వాళ్ళకి ఏ విధంగా కూడా న్యాయం జరగటం లేదు అనే విషయాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేసింది ఈ నటి. మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తే శ్రీ రెడ్డి ప్రస్తావించిన సమస్య చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...