Home Film News Balayya Lady Fan: లేడి ఫ్యాన్ బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసిన బాలయ్య‌.. ఆయ‌న‌కి న‌చ్చితే ఇలాగుంటది..!
Film News

Balayya Lady Fan: లేడి ఫ్యాన్ బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసిన బాలయ్య‌.. ఆయ‌న‌కి న‌చ్చితే ఇలాగుంటది..!

Balayya Lady Fan: విశ్వవిఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క‌రామారావు త‌న‌యుడు, టాలీవుడ్ స్టార్ హీరో బాల‌కృష్ణ ఒక హీరోగా, రాజ‌కీయ నాయకుడిగా తెలుగువారి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. సినిమాల‌లో ఆయ‌న పోషించని పాత్ర‌లు లేవు అంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌ల అన్‌స్టాప‌బుల్ షోకి హోస్ట్ గా కూడా వ్య‌వ‌హ‌రించి స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు బాలయ్య‌. ఆయ‌న ఒక బ్రాండ్. న‌చ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. నమ్మిన వారికి ప్రాణమిస్తాడు. తేడావస్తే తాట కూడా తీస్తాడు… ఇది రీల్ లైఫ్‌లో కాదు రియ‌ల్ లైఫ్‌లోనే. సినిమాల్లో బాల‌య్య ముఖానికి మేకప్ ఉంటుందేమోగానీ నిజజీవితంలోఅలాంటి  ముసుగు ఉండదు.

బాల‌కృష్ణ‌కి అభిమానులు కాదు వీరాభిమానులు ఉంటారు. ఆయ‌న తన అభిమానుల కోసం ఎంత దూర‌మైన వెళ‌తాడు.  ఆ మ‌ధ్య త‌న‌కు  విమానంలో పరిచయమైన ఓ అభిమాని గృహ ప్రవేశవానికి వెళ్లి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచారు బాల‌య్య‌.  ఫిల్టర్ లేని బాలయ్య మ‌న‌సు వెన్న అని అంద‌రు ఇందుకు అంటారు అని అప్పుడు సోష‌ల్ మీడియాలో అభిమానులు తెగ సంద‌డి చేశారు.  బాల‌కృష్ణ‌ పైకి గంభీరంగా కనిపించినా ఆయన చాలా సున్నితత్వం అని ఆయ‌న‌తో ప‌ని చేసిన వారు చాలా సార్లు చెప్పారు. తాజాగా బాల‌కృష్ణ త‌న  లేడీ అభిమాని పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశారు. కేక్‌ కటింగ్‌ చేయించి అక్షింతలు వేసి ఆమెని ఆశీర్వదించారు కూడా.

అమెరికాలో జరుగుతున్న తానా సంబరాల కోసం అక్క‌డికి వెళ్లిన బాల‌య్య  ప్రస్తుతం అమెరికాలోని ఫిలడెల్పియాలోనే ఉంటున్నారు . సతీమణి వసుంధరతో పాటు తానా మ‌హా స‌భ‌ల్లో పాల్గొన‌గా, ఆ స‌భ‌ల‌లో బాల‌య్య తెలుగు రాజ‌సం ఉట్టిప‌డ దుస్తుల‌లో ద‌ర్శ‌నం ఇచ్చారు. ఇక ఆ స‌మ‌యంలో  బాలకృష్ణ దగ్గరకు లేడి అభిమాని రాగా, ఆమె  తన పుట్టిన రోజు అని చెప్పగానే.. వెంటనే ఆమెతో కేక్‌ కటింగ్‌ చేయించాడు. బాలకృష్ణ, ఆయన సతీమణి ఆమెకి  అక్షింతలు వేసి ఆశీర్వ‌చ‌నాలు కూడా అందించారు.. ఆ లేడీ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని బాల‌య్య అందించ‌డం  ప‌ట్ల ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం  ఆ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, వాటికి మా బాల‌య్య మ‌న‌స్సు బంగారం అని కామెంట్ చేస్తున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...