Home Film News చావును సైతం లెక్క చేయకుండా హరికృష్ణ చేసిన మూవీ ఏమిటంటే..!
Film News

చావును సైతం లెక్క చేయకుండా హరికృష్ణ చేసిన మూవీ ఏమిటంటే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ త‌ర్వాత‌ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో బాలకృష్ణ, హరికృష్ణ ఈ కుటుంబంలో రెండో తరం హీరోలుగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హరికృష్ణ తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సినిమాల్లోనూ అలాగే రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు. అయితే హరికృష్ణ తన కెరీర్ లో ఎక్కువ సినిమాల్లో నటించలేదు. చేసిన తక్కువ సినిమాలైనా ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు.

Sr NTR Harikrishna: ఆ స్టార్ హీరో కారణంగా ఎన్టీఆర్ హరికృష్ణ రెండు  సంవత్సరాలు మాట్లాడుకోలేదా... అలాంటి చిచ్చు పెట్టారా - Sr Ntr Harikrishna  Who Spoke For Two Years ...

హరికృష్ణ నటించిన సినిమాల్లో సీతారామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, లాహిరి లాహిరిలో వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇదే సమయంలో హరికృష్ణతో ఎక్కువ సినమాలు చేసిన దర్శకుడు కూడా వైవిఎస్ చౌదరి. ఈ క్రమంలోనే వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన లాహిరి లాహిరిలో సినిమాలో ఒకీలక పాత్రలో హరికృష్ణ నటించారు. చాలా సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర.. రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం హరికృష్ణ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నటించడం అందర్నీ షాక్ గురి చేసింది.

Hari Krishna who is not afraid of death for film

ఈ సినిమాలో విలన్ గా నటించిన జయప్రకాశ్ రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా ఆగమని హరికృష్ణ లైట్లు వేసినా ఆగకుండా వచ్చేస్తాడు. దీంతో కార్లు రెండు రైల్వే ట్రాక్ పైకి వచ్చి సరిగా మధ్యలో ఆగిపోతాయి కొద్దిసేపటి వరకు ఎవరు వెనక్కి దగ్గరు అదే సమయంలో ట్రైన్ వేగంగా వస్తుండటంతో భయపడిన జయప్రకాష్‌రెడ్డి తన కారును వెనక్కి తీస్తాడు. ఇక అప్పుడు హ‌రీకృష్ణ కారు ముందుకు వెళ్లాలి కానీ కారు స్టార్ట్ కాదు ఎంత స్టార్ట్ చేసినా అవదు ఒకపక్క ట్రైన్ వచ్చేస్తుంది.

Lahiri Lahiri Lahirilo Movie || Harikrishna & Jaya Prakash Reddy Action  Scene || Aditya, Ankhita - YouTube

కానీ హరికృష్ణ ఏం మాత్రం భయపడకుండా మరో రెండు మూడు సార్లు కార్‌ను స్టార్ట్‌ చేయడానికి ట్రై చేశాడు మూడోసారి కార్ స్టార్ట్ అయింది. వెంటనే ముందుకు దూకించాడు హరికృష్ణ. అలాంటి సమయంలో హరికృష్ణ భయపడి ఏం చేయకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఇక ఈ సన్నివేశం తెరకెక్కించే సమయంలో కారులో మరెవరైనా ఉంటే కచ్చితంగా భయపడి హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ హరికృష్ణ మాత్రం ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశంలో న‌టించిరు. ఇక ఈయన ధైర్యానికి వైవిఎస్ చౌదరి ఎంతగానో మెచ్చుకున్నారట. అలా సినిమాలోని సన్నివేశం కోసం తన ప్రాణాలను సైతం హరికృష్ణ లెక్కచేయలేదని అప్పట్లో ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...