Home Film News డెవిల్ రివ్యూ: కళ్యాణ్ రామ్ ఊచకొత.. సినిమా బ్లాక్ బాస్టరా..!?
Film NewsReviews

డెవిల్ రివ్యూ: కళ్యాణ్ రామ్ ఊచకొత.. సినిమా బ్లాక్ బాస్టరా..!?

టైటిల్‌: డెవిల్
విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023
నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు
దర్శకుడు : అభిషేక్‌ నామా
నిర్మాత: అభిషేక్‌ నామా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
ఎడిటర్: తమ్మిరాజు

FL ప‌రిచ‌యం :
బింబిసార, అమిగోస్ వంటి సినిమాల‌ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పిరియాడిక్ థ్రిల్లర్ డెవిల్. ఈ సినిమాలో మలయాళీ అందం సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్ అండ్ టీజర్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగువారిని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..

Devil Movie | కళ్యాణ్ రామ్ 'డెవిల్' వాయిదా.. కారణం ఇదే.!-Namasthe Telangana
క‌థ‌:
భారతదేశంలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో నడిచిన కథ ఇది.. ఓ జమీందారు కుటుంబంలో జరిగిన హత్యాను ఎవరు చేశారో విచరణ చేయడానికి డెవిల్ గా(నందమూరి కళ్యాణ్ రామ్) అక్కడికి వస్తాడు. అక్కడ ఏం జరిగింది.. ఆస‌లు సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ ఈ విచారణ కోసం ఆ దివాణంకు ఎందుకు రావాల్సి వచ్చింది..? ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషధ (సంయుక్త మీనన్) ఎవరు ?, ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేస్తాడు.? ఇంతకీ సుభాష్ చంద్రబోస్ కు డెవిల్‌కు ఉన్న సంబంధం ఏమిటి.. అంతేకాకుండా ఆహత్య ఎందుకు జరిగింది.? ఆ హత్యకు మాళవిక నాయర్ పాత్రకు సంబంధం ఏమిటి..? చివరిగా డెవిల్ లోని అసలు పాత్ర ఏమిటి అనేది ఈ సినిమా మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్ తన గ‌త‌ సినిమాలకంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో నడిచే ఈ మైండ్ గేమ్ య‌క్షన్ డ్రామా తో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చాడు. అదేవిధంగా ఈ సినిమాలో తన లుక్స్ అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ ను చూపించడానికి కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం ఎంతో బాగుంది. మరీ ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. మెయిన్ గాసెకండ్ హాఫ్ లో వచ్చే త్రివర్ణ పాత్రకు.. సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్ , సన్నివేశాలు కూడా ఎంతో బాగున్నాయి. అదేవిధంగా హీరోయిన్ గా సంయుక్త మీనన్‌తో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు హీరో- హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే మెప్పించింది.

Devil 2023 Telugu Movie Review, USA Premiere Report

ఇక హీరోయిన్గా సంయుక్త మీనన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. అదేవిధంగా మరో ముఖ్యమైన పాత్రలు నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో మెప్పించింది. సినిమాకు సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు కూడా బాగున్నాయి. ఈ సినిమాకి మరో ముఖ్య ఆకర్షణ నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లే నడుస్తుంది. ఇక విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు.

ఇక కమెడియన్ సత్యతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఇక రచయిత శ్రీకాంత్ విస్సా రాసుకున్న మెయిన్ పాయింట్ అండ్‌ ట్రీట్మెంట్ బాగున్నాయి మొత్తం మీద ఈ సినిమాతో యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని త్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఆ అక‌ట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కథ‌, మెయిన్ కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే విషయంలో కొన్నిచోట్ల స్లో అనిపించింది.. ఫస్ట్ ఆఫ్ కథనం విషయంలో రాజీ పడకుండా ఉండి ఉంటే కొంత బాగుండేది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమా సాగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠను ఇంకా పెంచగలిగే ఆవ‌కాశం ఉన్నప్పటికీ మేకర్స్ పూర్తిస్థాయిలో దాన్ని వినియోగించుకోలేదు. అదేవిధంగా కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

Devil Movie Teaser Out- Nandamuri Kalyan Ram plays a suave secret agent

టెక్నికల్‌గా ఎలా ఉందంటే:
ఈ సినిమాకు పని చేసిన‌ సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడాలంటే.. దర్శకుడు అభిషేక్‌ నామా తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ ఎంతో బాగుంది.. ఈ సినిమాలో చాలా చోట్ల ప్రేక్షకులకు లాజిక్ మిస్ కాకుండా ఉంటే సినిమా ఇంకా బాగుండేది.. ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే.. పాటలు పరంగా బాగున్నాయి. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో కనిపించే ప్రతిఫేమ్ ఎంతో ఎఫెక్టివ్ గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

Devil' review: Kalyan Ram entertains in spy-thriller

చివరగా చెప్పేది ఏంటంటే:
డెవిల్’లో కథానాయకుడు కళ్యాణ్ రామ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమా కథా నేపథ్యం బావుంది. ప్రారంభంలో పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ… ఇంటర్వెల్ ముందు దర్యాప్తులో ఆసక్తి మొదలైంది. ఆ ట్విస్టులు వర్కవుట్ అయ్యాయి. మిస్టరీ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే ఒకసారి హ్యాపీగా చూసి రావచ్చు.

ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే FL రేటింగ్- 2.75/5

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...