Home Film News మహేష్ హీరోగా రావాల్సిన బృందావనం సినిమా ఎన్టీఆర్ దగ్గరికి ఎలా వచ్చిందంటే..!
Film News

మహేష్ హీరోగా రావాల్సిన బృందావనం సినిమా ఎన్టీఆర్ దగ్గరికి ఎలా వచ్చిందంటే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది అగ్ర దర్శకులు ఉన్నారు వారిలో వంశీ పైడిపల్లి కూడా ఒకరు.. స్టోరీ రైటర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వంశీ పైడిపల్లి ప్రభాస్ హీరోగా వచ్చిన మున్నా సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బృందావనం సినిమా తీసి మంచి విజయం సాధించాడు.

What's next for Vamshi Paidipally?

ఈ సినిమా తర్వాత నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. అదేవిధంగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. ఈ సంక్రాంతికి కూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో వారసుడు సినిమా చేసి టాలీవుడ్- కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇక వారసుడు సినిమా తర్వాత వంశీ తన తర్వాత సినిమాను ఏ హీరోతోనో ఇంకా కన్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం ఆయన మంచి కథ రాసుకొనే బిజీలో ఉన్నాడు.

Watch Brindavanam Trailer On aha

ఇదే సమయంలో వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ మహేష్ కి మంచి ఫ్రెండ్ కావడంతో ఈయన ఎన్టీఆర్ తో చేసిన బృందావనం సినిమా స్టోరీని ముందుగా మహేష్ కు చెప్పాడట. ఆ సమయంలో అప్పటికే మహేష్ త్రివిక్రమ్ తో ఖ‌లేజా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక దాంతో బృందావనం సినిమాని చేయలేకపోయాడు. అప్పుడు వంశీకి తర్వాత మనం వేరే సినిమా చేద్దామని మహేష్ మాటిచ్చాడట. దాంతో మహేష్ బృందావనం సినిమాని వదులుకోవటంతో మళ్ళీ ఆయన డైరెక్షన్లో మహర్షి సినిమా చేశాడు.

Mahesh Babu And Jr NTR To Share Screen Space For Allu Aravind's Next

ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో వంశీ పైడిపల్లి ఎప్పటినుంచో మహేష్ బాబుకి ఒక మంచి హిట్ ఇద్దామని అనుకున్నాడు మహర్షి సినిమాతో ఒక సూపర్ డూపర్ హిట్ అయితే వంశీ పైడిపల్లి మహేష్ కి ఇచ్చాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ అప్పట్లోనే రూ. 150 కోట్ల వరకు భారీ కలెక్షన్లు సాధించి మహేష్ కెరీర్ లోని రూ.100 కోట్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం బృందావనం సినిమా మహేష్ బాబు చేసి ఉంటే బావుండేది అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ కి సంబంధించిన స్టోరీ కాబట్టి మహేష్ బాబు అయితే సాఫ్ట్ లుక్స్ తో ఇంకా బాగుండేది అని వాళ్ళ అభిప్రాయం.

Mahesh Babu predicted Vamshi Paidipally's National Award win in 2017. We  have proof - India Today

మొత్తానికి మహేష్ బాబు వంశీ పైడిపల్లి తో ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీసి వాళ్ళ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు.ఇక ఈ సినిమా తర్వాత వారసుడు సినిమా కూడా మహేష్ బాబు చేయాల్సింది కానీ ఆ స్టోరీ మహేష్ బాబు కి నచ్చకపోవడం తో అది రొటీన్ స్టోరీ  కావడంతో మహేష్ బాబు ఆ సినిమాని వదులుకోవడం జరిగింది. ఇక వీళ్ళ కాంబో లో మరో సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...