Home Film News Sita Ramam Trailer : అందమైన, భావోద్వేగభరితమైన సినిమా ‘సీతా రామం’..
Film News

Sita Ramam Trailer : అందమైన, భావోద్వేగభరితమైన సినిమా ‘సీతా రామం’..

Sita Ramam Trailer
Sita Ramam Trailer

Sita Ramam Trailer: యంగ్ వెర్సటైల్ యాక్టర్‌ దుల్కర్ సల్మాన్.. ‘మహానటి’ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ‘అందాల రాక్షసి, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘పడిపడిలేచే మనసు’ వంటి విభిన్నమైన ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘపూడి దర్శకత్వంలో.. వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మిస్తున్న బ్యూటిఫుల్ ఫిల్మ్ ‘సీతా రామం’ (యుద్ధంతో రాసిన ప్రేమకథ)..

మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. 1960’s బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమకీ యుద్ధానికీ ముడిపెడుతూ అపురూప దృశ్యకావ్యంగా తెరెకెక్కిస్తున్న ఈ సినిమాలో సుమంత్, రష్మిక మందన్న కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోమవారం ‘సీతా రామం’ ట్రైలర్ విడుదల చేశారు.

చక్కటి కథ కథనాలతో హృదయాన్ని హత్తుకునే అందమైన, భావోద్వేగభరితమైన సినిమాగా ‘సీతా రామం’ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్, సీతా మహాలక్ష్మికి రాసిన ఉత్తరాన్ని ఆమెకు చేర్చడం గురించి చూపించారు.

ఆ పాత్రలో రష్మిక కనిపించనుంది. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సచిన్ కేద్‌కర్, శత్రు కీలకపాత్రల్లో నటించారు. పి.ఎస్.వినోద్, శ్రేయాస్ కృష్ణ విజువల్స్, విశాల్ చంద్ర శేఖర్ బ్యాగ్రౌండ్ స్కోర్, నటీనటుల నేచురల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ‘సీతా రామం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...