Home Film News Rajamouli: ఆ హీరోతో సినిమా అంటే ఆమ‌డ దూరం వెళుతున్న రాజమౌళి.. అందుకు కార‌ణం?
Film News

Rajamouli: ఆ హీరోతో సినిమా అంటే ఆమ‌డ దూరం వెళుతున్న రాజమౌళి.. అందుకు కార‌ణం?

Rajamouli:రాజ‌మౌళి.. ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్. కెరీర్‌లో ఒక్క అప‌జ‌యం ఎరుగ‌ని రాజ‌మౌళి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచాడు. బాహుబ‌లి సినిమాతో అంద‌రి దృష్టి టాలీవుడ్‌పై ప‌డేలా చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ సాధించి తెలుగోడి స‌త్తా  ఏంటో చాటాడు. ప్ర‌తి సినిమాకి క‌నీసం మూడేళ్ల స‌మ‌యం తీసుకుంటున్న రాజ‌మౌళి దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాలు చేస్తున్నాడు.త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం అడ్వెంచర్ మూవీగా ఉంటుంద‌ని, ఈ సినిమాతో హాలీవుడ్ రికార్డ్‌ల‌ని సైతం బ‌ద్దలు కొట్టాల‌ని క‌లలు కంటున్నాడు. అంతేకాదు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి బాగా ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాడు. అయితే ఇండ‌స్ట్రీలో ని ప్ర‌ముఖ హీరోలంద‌రితో ప‌ని చేయాల‌నుకుంటున్న రాజ‌మౌళి.. ఆ ఒక్క హీరోకి మాత్రం  దూరంగా ఉంటున్నాడ‌ట‌.

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన  ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ర‌వితేజ‌ల‌ తో సినిమాలు చేశారు రాజ‌మౌళి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఆయ‌న సినిమా చేయాలని అనుకుంటున్న‌ప్ప‌టికీ ఇప్పుడు ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న  ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రావ‌డం ఇప్ప‌ట్లో అసాధ్య‌మ‌ని రాజ‌మౌళి స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ఇక మెగా హీరో అయిన అల్లు అర్జున్‌తో సినిమా చేయ‌న‌ని అంటున్నాడట జ‌క్క‌న్న‌. అందుకు కార‌ణం  అల్లు అరవింద్ అని అంటున్నారు.గ‌తంలో రామ్ చ‌రణ్ హీరోగా గీతా ఆర్ట్స్ లో బేనర్ లో అల్లు అర‌వింద్ నిర్మాత‌గా మ‌గ‌ధీర అనే సినిమా చేశాడు రాజమౌళి.

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే ఈ సినిమా క్రెడిట్ త‌న‌కి కొంత కూడా ఇవ్వ‌కుండా  మొత్తం క్రెడిట్ అంతా కూడా అల్లు అరవింద్ తీసుకున్నార‌ని టాక్. మా వల్ల‌నే ఇలాంటి అద్భుత‌మైన చిత్రం రూపొందింద‌ని అల్లు అర‌వింద్   చెప్ప‌డంతో  కోపోద్రిక్తుడైన రాజమౌళి..  మగధీర విజయోత్సవానికి కూడా  వెళ్లలేదు. ఇక  అప్పటినుండి రాజమౌళి గీత ఆర్ట్స్ బానర్ పై గుర్రుగా ఉన్న అత‌ను ఆ బేన‌ర్‌లో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. అంతేకాదు అర‌వింద్ త‌న‌యుడైన బ‌న్నీతో కూడా సినిమా చేసేందుకు సిద్ధంగా లేడ‌ని అంటున్నారు. ఇప్పుడు బ‌న్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారిన నేప‌థ్యంలో ఫ్యూచ‌ర్‌లో అయిన మ‌న‌సు మార్చుకొని సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...