Home Film News Keerthy Suresh: ఇద్దరి కొంప ముంచిన కీర్తి సురేష్‌.. ఇప్పుడు మ‌రో హీరోకి కూడా స్పాట్ పెట్టిందిగా..!
Film News

Keerthy Suresh: ఇద్దరి కొంప ముంచిన కీర్తి సురేష్‌.. ఇప్పుడు మ‌రో హీరోకి కూడా స్పాట్ పెట్టిందిగా..!

Keerthy Suresh: మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది. మ‌హాన‌టి చిత్రంతో దేశ వ్యాప్తంగా అంద‌రి అభిమానాన్ని చూర‌గొన‌డ‌మే కాకుండా నేషన‌ల్ అవార్డ్ కూడా ద‌క్కించుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత కీర్తి ప‌లు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసింది. ఈ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయ్యాయి. దీంతో ఆ రూట్ నుండి ప‌క్క‌కి వ‌చ్చి హీరోల స‌ర‌స‌న న‌టిస్తుంది. స్టార్ హీరోల స‌ర‌స‌న మంచి మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న స‌మ‌యంలో కీర్తి సురేష్ సిస్ట‌ర్ పాత్ర‌ల‌కి కూడా సై అన‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. అయితే కీర్తి తీసుకున్న నిర్ణ‌యం ఆమెకి తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింది.

కీర్తి సురేష్‌.. 2022లో “అన్నాత్తే (తెలుగులో పెద్దన్న) అనే  చిత్రంలో ర‌న‌జ‌నీకాంత్ సోద‌రిగా క‌నిపించింది.ఈ చిత్రం కమర్షియల్‌గా పరాజయం పాల‌వ‌డంతో కీర్తి అభిమానులు నిరాశ చెందారు. కీర్తి తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం ఆమెకి ఏ మాత్రం క‌లిసి రాలేదు. అయితే ఈ సినిమా త‌ర్వాత భోళా శంక‌ర్  చిత్రంలో చిరంజీవికి సోదరిగా నటించారు.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. రెండు చిత్రాలో కీర్తి సురేష్ న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డ‌ప్ప‌టికీ సినిమాలు దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. తాను సోద‌రిగా న‌టించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావ‌డంతో మ‌రోసారి ఆ ప్ర‌యోగం చేయ‌ద‌ని అంద‌రు అనుకున్నారు.

కాని త‌మిళ స్టార్ హీరో అజిత్ చిత్రంలో సోద‌రిగా న‌టించేందుకు కీర్తి సిద్ధ‌మైంది. దీంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయిన‌ట్టేన‌ని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు.  కీర్తి ప్రతిభావంతురాలైన  నటి  కాగా, సినిమా విజయం కథ, సహాయక తారాగణం, దర్శకత్వం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సినిమా ఫ్లాప్ అనేది ఆమె సోదరిగా న‌టించ‌డం వ‌ల‌న కాదు.  ఆమెను ఐరన్ లెగ్ అని లేబుల్ చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు అని కొంద‌రు విశ్లేష‌కులు చెప్పుకొస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...