Home Film News Rajasekhar: ఈ కార‌ణాల వ‌ల్ల‌నే రాజ‌శేఖ‌ర్ కెరీర్ ప‌త‌నమైందా.. అదే ఆయ‌న కొంప ముంచిందా?
Film News

Rajasekhar: ఈ కార‌ణాల వ‌ల్ల‌నే రాజ‌శేఖ‌ర్ కెరీర్ ప‌త‌నమైందా.. అదే ఆయ‌న కొంప ముంచిందా?

Rajasekhar: యాంగ్రీ యంగ్‌మెన్‌గా అభిమానుల‌చే పిలిపించుకున్న రాజ‌శేఖ‌ర్ ఒక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించ‌డ‌మే కాకుండా ఎన్నో సూపర్ హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అల్ల‌రి ప్రియుడు సినిమాతో రొమాంటిక్ హీరో అనిపించుకున్న రాజ‌శేఖ‌ర్..  ఆహుతి వంటి సినిమాల‌తో సిన్సియ‌ర్ పోలీసుగా క‌నిపించి అద‌ర‌హో అనిపించారు.. చాలా మంది హీరోలు.. పోలీసుల పాత్ర‌లు పోషించిన కూడా  రాజ‌శేఖ‌ర్ వంటి న‌ట‌న చూపించ‌లేక పోయారు. రాజశేఖర్ ఘనత గుర్తించిన ఉమ్మ‌డి ఏపీ పోలీసుల సంఘం 1995లో   హైద‌రాబాద్‌లో  ఘ‌నంగా స‌త్క‌రించింది కూడా. ఇక రాజ‌శేఖ‌ర్‌ ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలో జీవిత‌ను ప్రేమించి చేసుకున్నాడు.అయితే జీవిత‌ని వివాహం చేసుకోకముందు, చేసుకున్న కొన్ని రోజుల వ‌ర‌కు ఆయ‌న కెరీర్ సాఫీగానే సాగింది.
ప్ర‌తి మ‌నిషి జీవితంలో కొన్ని లోపాలు ఉన్నట్టు రాజ‌శేఖ‌ర్ జీవితంలోనూ కొన్ని వీక్‌నెస్‌లు ఉన్నాయి.  ఏ రోజు కూడా  స‌మ‌యానికి షూటింగుల‌కు వ‌చ్చేవారు కాద‌న్న టాక్ న‌డిచింది. ఉద‌యం 8 గంట‌ల‌కు షూటింగ్ ఉంటే ఆయన  ఏకంగా 11 గంట‌ల‌కు వ‌చ్చేవార‌ట‌. దీంతో అనేక మంది నిర్మాత‌లు చాలా న‌ష్ట‌పోయార‌ని అంటారు. ప‌లు సంద‌ర్భాల‌లో నిర్మాత‌లు కంప్లైట్స్ కూడా చేశారు. రాజ‌శేఖ‌ర్ చేస్తున్న ఆల‌స్యం వ‌ల‌న మిగిలిన న‌టులు వెళ్లిపోతున్నార‌ని, దాని వ‌ల‌న షూటింగ్ ఆపేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఆయ‌న‌పై నిర్మాత‌ల మండ‌లిలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్‌పై ఆరు మాసాల పాటు నిషేధం కూడా విధించారు.
నిషేదం ఎత్తివేశాక కూడా రాజ‌శేఖ‌ర్‌లో మార్పు రాలేదు.  లేట్ నైట్లు  పార్టీల‌కి వెళ్ల‌డం.. ఇక  ఉదయం పూట చాలా ఆల‌స్యంగా నిద్ర లేచి షూటింగుల‌కు చాలా ఆల‌స్యంగా రావ‌డంతో నిర్మాత‌లు విసిగిపోయారు. దీంతో రాజ‌శేఖ‌ర్‌.. చాలా సినిమాల‌ను కోల్పోయారు. ముఖ్యంగా రామానాయుడు వంటివారు.. రాజ‌శేఖ‌ర్‌తో సినిమా చేయ‌న‌ని ప్ర‌క‌టించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయంటే అందుకు కార‌ణం ఆయ‌న‌లోని  ఈ బ‌ల‌హీన‌తే కార‌ణ‌మ‌ని అంటారు.ఇక రాజ‌శేఖ‌ర్‌కి కోపం వ‌స్తే అస్స‌లు త‌ట్టుకోలేడు. కోపం లో ఏం మాట్లాడుతాడో, ఏం చేస్తాడో అతడికే తెలియదు.ఒకసారి బాంబే నుంచి వచ్చిన హీరోయిన్ విషయంలో కోపం తో ఊగిపోయి ఏకంగా ఆమెకు గన్ను గురి పెట్టాడనే వార్త అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...