Home Film News Chaitanya: నిహారిక భర్త చైతన్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి, ఆయన ఫ్యామిలీ వివరాలు ఏంటి
Film News

Chaitanya: నిహారిక భర్త చైతన్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి, ఆయన ఫ్యామిలీ వివరాలు ఏంటి

Chaitanya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ గురించి కూడా మనందరికీ తెలిసిందే. నిహారికను పెళ్లి ,చేసుకోకముందు వరకు చైతన్య ఎవరు అనేది అంతగా తెలియదు. కానీ నిహారికను పెళ్లి చేసుకున్న తర్వాత విపరీతమైన పాపులారిటి దక్కింది. ఇక విడాకుల తర్వాత కూడా చైతన్య జొన్నలగడ్డ రియల్ లైఫ్ విశేషాలను సెర్చ్ చేస్తున్నారు. చైతన్య జొన్నలగడ్డ హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్‌లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత రాజస్థాన్ లో బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుండి మ్యాథ్స్ లో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారు.

ఆ తర్వాత హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి బిజినెస్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ తీసుకున్నారు. చైతన్యకు ఫస్ట్ నుండి లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండేవట. అలా కాలేజ్ రోజుల్లో స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా వర్క్ చేశారు. తనలో ఉన్న స్ట్రాంగ్ లీడర్ షిప్ స్కిల్స్ ని ప్రజంట్ చేయడం వల్ల లెక్చరర్స్  కూడా చైతన్యని మంచి స్టూడెంట్ గా ట్రీట్ చేసేవారట. ఆ తర్వాత చైతన్య జొన్నలగడ్డ చదువు పూర్తయ్యాక తనకు సొంతంగా ఓ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం రకరకాల సంస్థల్లో డిఫరెంట్ క్యాడర్ లో వర్క్ చేశారు. అంతేకాదు ఇంటర్న్ షిప్ గా కూడా వర్క్ చేసి బిజినెస్ ఫీల్డ్ లో అనుభవం సంపాదించుకున్నారు.
ఇక చైతన్య తండ్రి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు పోలీస్ అధికారి. చైతన్య తాతయ్య వెంకటేశ్వర్లు జొన్నలగడ్డ కూడా పోలీస్ అధికారి. చైతన్యకు దీపిక అనే అక్క కూడా ఉంది. ప్రజంట్ ఆమె పెళ్లై అమెరికాలో ఉంటున్నారు. ఫస్ట్ అయితే చైతన్య జొన్నలగడ్డ హైదరాబాద్ లో ప్రభుత్వ సలహా సంస్థ కెపీఎంజీలో అసిస్టెంట్ మేనేజర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఇంటర్న్ గా కూడా వర్క్ చేశారు.  ఆ మధ్య సొంత కంపెనీ కూడా స్టార్ట్ చేశారు. డిసెంబర్ 2020 లో నటి నిహారికతో పెళ్లి జరిగింది. రీసెంట్ గా వీరిద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...