Home Film News Sada: స‌దా ఇన్నాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదా..మొగుళ్ల‌ని ప‌శువుల‌తో పోల్చిందిగా..!
Film News

Sada: స‌దా ఇన్నాళ్లు పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం ఇదా..మొగుళ్ల‌ని ప‌శువుల‌తో పోల్చిందిగా..!

Sada: జ‌యం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ స‌దా. ఈ అమ్మ‌డు న‌టించిన  సినిమా రిలీజై సుమారు 20ఏళ్లు గడిచిపోయినప్పటికి ఇప్పటికి ఈ భామ‌ యంగ్ హీరోయిన్‌గానే కనిపిస్తోంది. ఒక‌ప్పుడు వెండితెర‌పై ఓ ఊపు ఊపిన స‌దా వెండి తెర నుంచి బుల్లితెరకు షిప్ట్ అయింది ..స్టార్‌ మాలో ప్ర‌సారం అవుతున్న‌ నీతోనే డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లో కనిపిస్తూ సందడి చేస్తోంది. వ‌య‌స్సు పెరిగిన కూడా అదే గ్లామ‌ర్ మెయింటైన్ చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌రణ ద‌క్కించుకుంటుంది. స‌దా చివరిగా   టార్చ్ లైట్ అనే సినిమాలో నటించింది. ఇందులో వేశ్య పాత్రలో  నటించి మెప్పించింది సదా. ఈ  సినిమా పెద్దగా ప్రభావం చూపించక‌పోవ‌డంతో అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌డం లేదు.

స‌దా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న అందచందాల‌తో యూత్‌ని మంత్ర ముగ్ధులని చేస్తూ ఉంటుంది.  సదా కెరీర్‌లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు పెద్ద హిట్స్‌గా నిలిచాయి  . ఇక ‘నాగ’లో ఎన్టీఆర్ సరసన నటించింది. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో కూడా క‌థానాయిక‌గానే న‌టించింది స‌దా. పెద్ద హీరోల‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చిన కూడా అవి స‌దా కెరీర్‌కి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. నాలుగు ప‌దుల వ‌య‌స్సుకి చేరుకున్న ఈ భామ ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోక‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

తాజా ఇంట‌ర్వ్యూలో స‌దా ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డంపై ఆశ్చ‌ర్య‌కర‌మైన కామెంట్స్ చేసింది. పెళ్లి చేసుకుంటే ఫ్రీడ‌మ్ అంతా పోతుంద‌ని, ఇంత సంతోషంగా ఉండ‌లేమ‌ని అంటుంది స‌దా. వైల్డ్ లైఫ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన స‌దా..ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా అడవి కి వెళ్లి  జంతువులతో కాలక్షేపం చేస్తుంటాన‌ని తెలియ‌జేసింది. పెళ్లి చేసుకుంటే ఇవ‌న్నీ చేయ‌లేం. మ‌నం అర్ధం చేసుకునే వాడు దొరుకుతాడ‌ని న‌మ్మ‌కం లేదు. ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నా కూడా కొన్నాళ్ల‌కే విడిపోతున్నారు. అలాంట‌ప్పుడ పెళ్లి చేసుకోవ‌డం ఎందుక‌ని వైవాహిక జీవితానికి దూరంగా ఉంటున్న‌ట్టు తెలియ‌జేసింది స‌దా. ఈ భామ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...