Home Film News Niharika: అర్ధం చేసుకోమ‌ని వేడుకుంటున్న నిహారిక‌.. తొలిసారి విడాకుల‌పై స్పందించిన మెగా డాట‌ర్
Film News

Niharika: అర్ధం చేసుకోమ‌ని వేడుకుంటున్న నిహారిక‌.. తొలిసారి విడాకుల‌పై స్పందించిన మెగా డాట‌ర్

Niharika: మెగా బ్ర‌దర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక విడాకుల‌పై కొన్నాళ్లుగా అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 9,2020న రాజ‌స్తాన్‌లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్‌లో వీరిద్ద‌రు వివాహం చేసుకోగా, కొన్నాళ్ల‌పాటు ఈ ఇద్ద‌రు చాలా అన్యోన్యంగా ఉన్నారు. కాని త‌ర్వాత ఏమైందో ఏమో కాని ఒక‌రినొక‌రు సోష‌ల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారు. చైత‌న్య త‌మ పెళ్లి ఫోటోల‌ని ఇన్‌స్టాగ్రామ్ నుండి పూర్తిగా తొల‌గించారు. దీంతో విడాకుల అంశం ప్ర‌స్తావ‌నకి వ‌చ్చింది. ఇటీవ‌ల త‌న అన్న వరుణ్ తేజ్  ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో నిహారిక..  చైతన్యతో కనిపించకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

అయితే గ‌త రాత్రి నుండి నిహారిక కోర్టులో ద‌ర‌ఖాస్తు చేసిన పిటీష‌న్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో నిహారిక త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ పోస్ట్ పెట్టింది. చైతన్య‌, నేను ప‌ర‌స్ప‌ర అంగీకారంతో విడిపోతున్నాం. ఈ సమయం ఇద్దరికీ చాలా క‌ఠిన‌మైన స‌మ‌యం. ఎవ‌రు కూడా తమను ఇబ్బంది పెట్టొద్దంటూ ఇన్స్‌టాగ్రామ్ వేదికగా తెలియ‌జేసింది నిహారిక‌. ఇక తాము కొత్త జీవితాలను ప్రారంభించబోతున్నామని చెప్పిన నిహారిక తమ వ్యక్తిగత జీవితంలో కొంత  ప్రైవసీ కోరుకుంటున్నట్లు  కూడా పేర్కొంది. మేము తీసుకున్న నిర్ణ‌యాన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.ఇక ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసింది నిహారిక‌.

అయితే నిహారిక విడాకులు కోరుతూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో 1 ఏప్రిల్ 2023న దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుండ‌గా, ఈమె తరపున జనసేన పార్టీ సానుభూతిపరుడు అడ్వకేట్ కల్యాణ్ దిలీప్ సుంకర వాదనలు వినిపించారు. మే 29న ప‌లు వాదనలు జరుగగా ఇరువురి అభీష్టంమేరకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఫ్యామిలీ కోర్టు జూన్ 5వ తేదీన ఆర్డర్స్ పాస్ చేసింది. దీనికి సంబంధించిన ద‌ర‌ఖాస్తులు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.ఇక   చైత‌న్య త‌న బిజినెస్‌ల‌తో బిజీగా ఉండ‌నున్నాడు. నిహారిక ప‌లు వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ నిర్మాణంలో యాక్టివ్‌గా ఉండబోతున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అమీర్ ఖాన్ కూతురు మృతి..కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఫ్యాన్స్..!

చిత్ర పరిశ్రమను వరుస‌ విషాదాలు వెంటాడుతున్నాయి. అగ్ర సెలబ్రిటీలు మరణించారు అన్న విషాదం మరవకముందే మరొక...

వార్‌2 షూటింగ్ అండ్ క్రేజీ అప్డేట్… ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్‌లో హీరోలుగా రాణించినప్పటికీ ప్రతి హీరోకి బాలీవుడ్‌లో కూడా తన సత్తా చూపించాలని ఉంటుంది. అలా...

చిరంజీవి VS పవన్.. ఎవ‌రు తగ్గట్లేదుగా..!

మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగులో ఉన్న...