Home Film News Kajal: ఏంటి.. ఆ ద‌ర్శ‌కుడు అంద‌రి ముందే కాజ‌ల్‌ని బెల్ట్‌తో కొట్టాడా..!
Film News

Kajal: ఏంటి.. ఆ ద‌ర్శ‌కుడు అంద‌రి ముందే కాజ‌ల్‌ని బెల్ట్‌తో కొట్టాడా..!

Kajal: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్స్‌లో తేజ ఒక‌రు. ఆయ‌న త‌న కెరీర్‌లో కొన్ని సూప‌ర్ హిట్స్ తీసారు. ఇటీవ‌ల మాత్రం పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోతున్నారు. ఇటీవ‌ల ద‌గ్గుబాటి రామానాయుడు మ‌న‌వడితో క‌లిసి అహింసా అనే చిత్రం చేయ‌గా, ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది.అయితే తేజ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ని చేస్తే వారికి చెంప దెబ్బలు లేదా బెల్ట్ దెబ్బ‌లు ప‌డ‌డం ఖాయం అని ఓ టాక్ ఉంది. ఎవ‌రైన స‌రిగ్గా న‌టించ‌క‌పోతే వారిపై చేయి చేసుకోవ‌డం తేజ‌కి అల‌వాటు అని చాలా మంది అంటుంటారు. ఉద‌య్ కిర‌ణ్‌, స‌దా, నితిన్ వంటి వారు కూడా తేజ చేతిలో తన్నులు తిన్న‌వారే అని ప‌లువురు న‌టులు ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. అయితే ఈ ద‌ర్శ‌కుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని బెల్ట్‌తో కొట్టాడ‌ట‌. ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో  కాజ‌ల్  సినీ రంగ ప్రవేశం చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో కాజ‌ల్ కొన్ని సీన్స్ స‌రిగ్గా చేయ‌ని కార‌ణంగా ఆమెపై బాగా అరిచేవార‌ట‌.  ఎన్నిసార్లు చెప్పినా నీ తీరు మార్చుకోవా అంటూ తేజ ఆమెను  సెట్స్‌లోనే బెల్ట్ తో కొట్టాడంటూ  అప్ప‌ట్లో వార్తలు వినిపించాయి. కాని అవి రూమ‌ర్స్ అని కొందరు కొట్టిప‌డేసారు. అయితే అప్ప‌ట్లో  తేజ  ఓ ఇంటర్వ్యూలో  పాల్గొన్నప్పుడు కాజల్ ని చాలా త‌క్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు అది చూసిన  జనాలు నిజంగానే కాజల్ ని కొట్టాడు కావచ్చు అని అనుకున్నారు. ఆ  ఇంటర్వ్యూలో  తేజ మాట్లాడుతూ ఆమెకు అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా రాదు, న‌టించ‌డం అస్స‌లే రాదు.

నేను 30 రోజుల‌లో కంప్లీట్ చేయాల్సిన షూటింగ్ కాజ‌ల్ వ‌ల‌న 60 రోజుల‌కి పోయింది. డైలాగ్స్ మ‌ర్చిపోతుంది, స‌రిగ్గా ఎమోష‌న్స్ పండించ‌లేదు. ఎప్పుడు వెన‌క నుండి డైలాగ్స్ అందిస్తూ ఉండాలి అంటూ తేజ ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ విన్న ఆడియ‌న్స్ చిన్న త‌ప్పు చేస్తేనే చెంప చెళ్లుమ‌నిపించే తేజ .. ఆమెపై అన్ని అభాండాలు వేస్తున్నాడంటే కొట్టిన కొట్టే ఉంటాడు అని కొంద‌రు అనుమానం వ్య‌క్తం చేశారు.  ద‌ర్శకుడు కాక‌ముందు  తేజ ఒక స్టార్ సినిమాటోగ్రాఫర్.  తెలుగు సినిమాలతో పాటు హిందీలో కూడా దాదాపు 10 సినిమాలకు పైగా కెమెరామెన్ గా పనిచేసిన ఆయ‌న‌..ఆర్జీవీ దగ్గర దర్శకత్వంలో అసిస్టెంట్ గా పనిచేసి అనంత‌రం ద‌ర్శ‌కుడి అవ‌తారం ఎత్తాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...