Home Film News Rashmi: ర‌ష్మీని రాత్రికి వ‌స్తావా అని అంత డైరెక్ట్‌గా అడిగేశాడేంటి.. తిట్టి పోస్తున్న నెటిజ‌న్స్
Film News

Rashmi: ర‌ష్మీని రాత్రికి వ‌స్తావా అని అంత డైరెక్ట్‌గా అడిగేశాడేంటి.. తిట్టి పోస్తున్న నెటిజ‌న్స్

Rashmi: బుల్లితెర కామెడీ షోలు జ‌బ‌ర్ధస్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీలు ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జాని అందిస్తున్నాయి. ఒక‌వైపు యాంక‌ర్స్ గ్లామ‌ర్ షో, మ‌రోవైపు క‌మెడీయ‌న్స్ ప‌వ‌ర్ ఫుల్ కామెడీ ప్రేక్ష‌కుల‌కి మంచి మ‌జాని అందిస్తుంది. ముఖ్యంగా ఈ షోల‌లో ఆది తర్వాత ఆ రేంజ్‌లో త‌నదైన పంచ్‌లు వేసి న‌వ్విస్తున్నాడు రామ్ ప్ర‌సాద్. కాక‌పోతే కొన్నిసార్లు ఆయన కామెడీ బ‌ర‌స్ట్ అవుతుంది. బూతు కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్న నేప‌థ్యంలో నెటిజ‌న్స్ తిట్టిపోస్తున్నారు. ఒకప్పుడు సుధీర్, హైపర్ ఆది ఈ విషయంలో ఇలాంటి విమ‌ర్శ‌లు ఎన్నో ఎదుర్కొన్నారు. ఫ్యామిలిలో చూసే కార్యక్రమాల్లో ఇలాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగులు పెడితే ఎలా అని ప‌లు విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

రీసెంట్‌గా జ‌రిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంక‌ర్ ర‌ష్మీపై రామ్ ప్ర‌సాద్ చేసిన వల్గ‌ర్ కామెంట్ పై నెటిజ‌న్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ స్కిట్ లో భాగంగా ఆటో రాంప్రసాద్.. రష్మిని రాత్రికి వస్తావా అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ పేలుస్తాడు.. అప్పుడు ర‌ష్మీ… అసలు నేనెందుకు రాత్రికి రావాలి అడుగుతుంది. అప్పుడు రాంప్రసాద్ కాస్త వెరైట ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తూ.. నైట్ కి ఎందుకు పిలుస్తారో తెలియదా నీకు ? అని అంటాడు. అప్పుడు ప‌క్క‌నే ఉన్న ఇంద్ర‌జ ఏయ్ అని గ‌ట్టిగా అర‌వ‌డంతో .. మేడం మా ఊర్లో రాత్రికి జాత‌ర ఉంది.. ఆ జాత‌ర‌కే పిలుస్తున్నానంటూ క‌వ‌ర్ చేసుకున్నాడు.

 

ఆయ‌న ఎంత క‌వ‌ర్ చేసుకున్నా కూడా ఈ విష‌యంపై అంద‌రికి క్లారిటీ ఉండ‌డంతో రామ్ ప్ర‌సాద్‌ని నెటిజన్స్ తిట్టిపోస్తున్నారు. ఇక నువ్వు మార‌వా, ఇలాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఇబ్బంది పెడుతూనే ఉంటావా..ఎన్నాళ్లు మీరు ఇలాంటి డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ తో నెట్టుకొస్తారు అంటూ నెటిజ‌న్స్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గ‌తంలో కూడా విష్ణు ప్రియ శరీరంపై, ముక్కుపై రాంప్రసాద్ చేసిన డబుల్ మీనింగ్ డైలాగులు చాలా వివాదాస్ప‌దం అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ రాం ప్ర‌సాద్ అదే పంథా కొనసాగిస్తూ నెటిజన్లతో చీవాట్లు తింటున్నాడు. అయిన‌ప్పటికీ మనోడి పంథా మారడం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...