Home Film News Sai Dharam Tej Suicide: ఏంటి.. సాయి ధ‌ర‌మ్ తేజ్ సూసైడ్ చేసుకోవాల‌నుకున్నాడా.. ప‌వ‌న్ ఏం చేశాడంటే
Film NewsGossips

Sai Dharam Tej Suicide: ఏంటి.. సాయి ధ‌ర‌మ్ తేజ్ సూసైడ్ చేసుకోవాల‌నుకున్నాడా.. ప‌వ‌న్ ఏం చేశాడంటే

Sai Dharam Tej Suicide: మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కొన్ని రోజుల క్రితం  పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే.   సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. అదుపు త‌ప్పి కింద ప‌డిపోయాడు. దీంతో అత‌నికి  తీవ్ర గాయాలు కాగా, చాలా రోజులు ఆస్పత్రిలో అపస్మారక స్థితిలోనే ఉన్నాడు తేజ్. ఆ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు చాలా కంగారు ప‌డ్డారు. అభిమానులు అయితే  సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని  పెద్ద ఎత్తున పూజలు కూడా చేశారు. డాక్టర్ల కృషి.. ఫ్యాన్స్ పూజలు, పెద్దల ఆశీస్సులు, దేవుడి కటాక్షంతో.. సాయి ధ‌ర‌మ్ తేజ్ కోలుకొని ఇప్పుడు సినిమాల‌తో తిరిగి అల‌రిస్తున్నాడు.  ప్ర‌మాదం త‌ర్వాత సాయి ధ‌రమ్ తేజ్‌కి కొన్నాళ్లు స‌రిగా మాట కూడా రాలేదు.
ప్ర‌స్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్న సాయి ధ‌ర‌మ్ తేజ్.. ఇటీవ‌ల విరూపాక్ష చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి బ్రో అనే సినిమా చేయ‌గా, ఈ చిత్రం జూలై 28న రిలీజ్ కానుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ ఇద్ద‌రు క‌లిసి చిత్రంలో న‌టిస్తుండ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. చిత్ర క్లైమాక్స్ లో  సాయి ధ‌ర‌మ్ తేజ్ తన ప్రేమ విఫలమైనందుకు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడట. అన్నీ వ‌దిలి సూసైడ్ చేసుకోవ‌డానికి వెళుతున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడిలా వ‌చ్చి హిత‌బోధ చేస్తార‌ట‌.
అప్పుడు ప‌వ‌న్ మాట‌ల‌కు సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న నిర్ణ‌యం మార్చుకుంటార‌ని టాక్.  ఈ సన్నివేశంలో ఎమోషన్స్ ని బాగా పండించార‌ని ఓ ప్ర‌చారం అయితే న‌డుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ లేదు.అయితే సాయి ధ‌ర‌మ్ తేజ్ సూసైడ్ అని వార్త‌లు రాగానే చాలా మంది అభిమానులు కంగారు ప‌డ్డారు. కాని సినిమాలో అన్న విష‌యం తెలిసాక చ‌ల్ల‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. తొలిసారి త‌న మామ‌య్య‌తో క‌లిసి న‌టించినందుకు చాలా సంతోషం వ్య‌క్తం చేసారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...