Home Special Looks IMDB లో ఎక్కువ రేటింగ్ సాధించిన 30 అత్యుత్తమ భారతీయ సినిమాలు!
Special Looks

IMDB లో ఎక్కువ రేటింగ్ సాధించిన 30 అత్యుత్తమ భారతీయ సినిమాలు!

Top Rated Indian Movies On IMDB

భారతీయ సినిమా అనేక సినీ పరిశ్రమలకు నిలయం. బాలీవుడ్ తో పాటు సౌత్ లో ప్రతి భాషకు ప్రత్యేకమైన ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. ఐతే, వీటన్నిటిలో ఉత్తమమైన సినిమాలను తీసుకున్నప్పుడు.. పెద్దగా ఎలాంటి వివక్ష లేకుండా ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేస్తుంది imdb. ఇందులో రేటింగ్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వబడతాయి. అందులో అన్ని సాంకేతిక విషయాల్ని కూడా పరిగణించి ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇప్పటిదాకా మంచి రేటింగ్ పొందిన సినిమాల్ని ఒకసారి పరిశీలిద్దాం.

వీటిలో మొదటి మూడు సినిమాలు తమిళ సినిమాలే కావడం విశేషం. అందులోనూ రెండు కమల్ హాసన్ నటించినవే కావడం మరీ ప్రత్యేకం. 1987 లో కమల్ నటించిన ‘నాయకన్’ కి ఎక్కువగా 8.5 రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రెండవ సినిమా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన పరియేరుం పెరుమాళ్. ఇక మూడవది అంబే శివం. ఇందులో కమల్ హాసన్, మాధవన్ కలిసి నటించారు.

తర్వాత హాంకీ పాంకీ అనే హిందీ సినిమా ఉంది నాలుగో స్థానంలో. ఇక ఐదు, ఏడు స్థానాల్లో ఉన్న పథేర్ పాంచాలి, ది వరల్డ్ ఆఫ్ అపు రెండు కూడా సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చినవే. ఇక ఆరవ స్థానంలో ఉన్నది మన తెలుగు సినిమా కేరాఫ్ కంచెరపాలెం. ఇక ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ‘కిరీడమ్’, మణిచిత్రతజు అనే రెండు మలయాళ సినిమాలు ఉన్నాయి. ఇక పదో స్థానంలో నానా పాటేకర్ నటించిన ‘నట సామ్రాట్’ అనే సినిమా ఉంది.

ఇలా తొలి పది సినిమాల్లో మూడు తమిళ సినిమాలు, రెండు బెంగాలీ, రెండు మలయాళం, రెండు హిందీ, ఒక తెలుగు సినిమాలు ఉన్నాయి.

ఇక 11 వ స్థానంలో త్రిష, విజయ్ సేతుపతి నటించిన 96 మూవీ ఉంది. 12 వ స్థానంలో మరో తమిళ కమల్ హాసన్ సినిమా తెవర్ మాగన్ అనే సినిమా ఉంది. ఇక 13 వది హిందీ మూవీ బ్లాక్ ఫ్రైడే. కుంబలంగి నైట్స్ అనే మలయాళ సినిమా 14 వ స్థానంలో ఉంది. 15 వది మరో తమిళ సినిమా ‘విసారనై’. 3 ఇడియట్స్ అనే హిందీ మూవీ 16 వ స్థానంలో, మలయాళంలో వచ్చిన దృశ్యం 2 17 వ స్థానంలో ఉంది. 18 వ స్థానంలో సూరారై పొట్రు అనే తమిళ సినిమా, 19 వ స్థానంలో నాని నటించిన జెర్సీ, ఇక 20 వ స్థానంలో ఆమిర్ ఖాన్ నటించిన like stars on earth అనే హిందీ మూవీ ఉంది.

అలాగే 21,22 లో తలపతి, అసురన్, 23 – దంగల్, 24, 25 స్థానాల్లో రాక్షసన్, కైతి అనే రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. 26, 29 స్థానాల్లో రెండు మలయాళ సినిమాలు దేవాసురం, పెరంబు లు ఉన్నాయి. 27 వ స్థానాలో మరో సత్యజిత్ రే సినిమా అపరాజితో ఉంది. 28, 30 స్థానాల సినిమాలు రెండూ కూడా హిందీనే. అవి జానే బీ దో యారో, ప్యాసా.

ఇలా మొత్తానికి మొదటి 30 టాప్ రేటెడ్ సినిమాలలో అత్యధిక సంఖ్యలో 11 తమిళ సినిమాలు, 8 హిందీ సినిమాలు, 6 మలయాళ సినిమాలు, 3 బెంగాలీ, 2 తెలుగు సినిమాలు ఉన్నాయి. తమిళ సినిమా imdb లో ఎంత మంచి రేటింగ్ లు సంపాదిస్తుందో గమనించవచ్చు. అలాగే బాలీవుడ్ తో పోల్చుకుంటే చిన్న ఇండస్ట్రీ అయిన మలయాళ సినిమాలు కూడా ఆరు ఉన్నాయి. ఇక ఇండియాలో పెద్ద సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ నుంచి 8 సినిమాలు ఉండటం అంత విశేషం ఏమీ కాదు. దారుణంగా తెలుగు రెండే. కనీసం ఈ రెండు మాత్రమైనా ఉన్నందుకు తెలుగు వాళ్ళు ఖచ్చితంగా గర్వపడాలి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...