Home Film News ‘ఎతరుక్కుమ్ తునింధవన్’ : హ్యాపీ బర్త్ డే సూర్య!
Film News

‘ఎతరుక్కుమ్ తునింధవన్’ : హ్యాపీ బర్త్ డే సూర్య!

Happy Birthday Suriya Etharkum Thuninthavan

సూర్య ఎంత టాలెంటెడ్ నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా ఎన్నో ప్రత్యేకమైన పాత్రలు పోషించి తనకంటూ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డం ని ఏర్పాటు చేసుకున్నాడు. సూర్య కేవలం తమిళ్ లో మాత్రమే కాదు.. తెలుగు, మలయాళం, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నటుడు. చివరిసారిగా సూరారై పొట్రు సినిమాతో ప్రేక్షకులని అలరించిన సూర్య తన 46 వ పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమా లుక్ తో ముందుకు వచ్చాడు. ‘ఎతరుక్కుమ్ తునింధవన్’ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ సెకండ్ లుక్ విడుదలైంది.

సూర్య 1975 జూలై 23 న పుట్టాడు. ఇప్పటిదాకా 40 సినిమాలు వచ్చాయి. అతని అసలు పేరు సరవనన్ శివకుమార్. సూర్య అతని స్టేజ్ నేమ్ గా మారింది. 1997 లో నెరుక్కు నెర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా 2001 దాకా అతనికి బ్రేక్ రాలేదు. సూర్య కెరీర్ లో బెస్ట్ రోల్ గజిని. స్టేట్ లెవెల్ లో మూడు అవార్డ్స్, 4 సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, 2 ఎడిసన్ అవార్డ్స్, అలాగే ఒక విజయ్, సినీ మా అవార్డ్స్ గెలుచుకున్నాడు. చివరిగా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో అతని నటనకి మంచి గుర్తింపు వచ్చింది.

సూర్య కేవలం నటుడిగా మాత్రమే కాకుండా మంచి మోడల్ గా ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా చేస్తున్నాడు. హీరోయిన్ జ్యోతికని పెళ్లి చేసుకున్న సూర్య తమ్ముడు కార్తి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం. అటు రాజకీయంగా మత ఛాందస వాదానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునే సూర్య రాజకీయాల్లోకి వస్తాడని ఎదురుచూసే అభిమానులు కూడా ఎంతోమంది ఉన్నారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఎతరుక్కుమ్ తునింధవన్ ఎలా అదరగొడుతుందో చూద్దాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...