Home Film News Tholi Prema: భారీ ఎత్తున తొలి ప్రేమ రీరిలీజ్.. తొలిసారి ఆ ఈవెంట్ కూడా..!
Film News

Tholi Prema: భారీ ఎత్తున తొలి ప్రేమ రీరిలీజ్.. తొలిసారి ఆ ఈవెంట్ కూడా..!

Tholi Prema: ఇటీవ‌ల టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ క‌నిపిస్తుంది. స్టార్ హీరోల పాత సినిమాల‌ని ప‌లు సంద‌ర్భాల‌లో రీరిలీజ్ చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. పోకిరి సినిమాతో మొద‌లైన ఈ ట్రెండ్ న‌ర‌సింహ‌నాయుడు వ‌ర‌కు కొన‌సాగింది. దీనికి ఇప్ప‌ట్లో పులిస్టాప్ అయితే ప‌డే అవ‌కాశం లేదు. ఇక ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి కెరీర్‌లో గుర్తుండిపోయేలా చేసిన సినిమా తొలి ప్రేమ‌ కూడా రీ రిలీజ్‌ కాబోతుంది. ఇప్ప‌టికే ప‌వన్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ‘ఖుషీ’, ‘జల్సా’ సినిమాలను రీ రిలీజ్ చేసిన అభిమానులు.. తొలి ప్రేమ చిత్రాన్ని కూడా తిరిగి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. తొలి ప్రేమ చిత్రం విడుద‌లై 25 ఏళ్లు అవుతున్న నేప‌థ్యంలో ఈ సినిమాని 300 థియేట‌ర్స్‌లో జూన్ 30వ తేదీని రీ రిలీజ్ చేయబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

తొలి ప్రేమ చిత్రాన్ని శ్రీ మాత క్రియేషన్స్ కొనుగోలు చేసి, 4K కి రీ మాస్టర్ చేయించి జూన్ 30వ తారీఖున విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను జూన్ 24వ తేదీన ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేయబోతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ట్రైల‌ర్ రిలీజ్ సాదాసీదాగా విడుద‌ల చేయడం లేదట‌. దీనికి ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి ఆ ఈవెంట్‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఇలా రీ రిలీజ్ సినిమాకు ట్రైలర్ ఈవెంట్‌ను చేసిన ఘనతను పవన్ ఫ్యాన్స్ అందుకోనున్నార‌న్న‌మాట‌. ఇక ఈ సినిమా విడుద‌ల‌ని అభిమానులు పండుగ‌లా జ‌రుపుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

 

రీరిలీజ్‌ల సినిమా విష‌యానికి వ‌స్తే ఖుషీ చిత్రం సాధించిన వ‌సూళ్ల‌ని వేరే హీరో సినిమాలు బ్రేక్ చేయ‌లేక‌పోయాయి. మ‌రి ప‌వ‌న్ తొలి ప్రేమ సినిమాతో త‌న రికార్డ్‌ని తానే చెరిపేసుకుంటాడా అనేది చూడాలి. ఇక‌ ‘తొలిప్రేమ’ సినిమా 1998లో రిలీజ్ కాగా, ఈ చిత్రానికి . కరుణాకరణ్ దర్శకత్వం వహించారు. తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. దేవా సంగీతాన్ని అందించారు. వాసుకి, అలీ, వేణు మాధవ్, రవి బాబు వంటి వాళ్లు సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు. తొలి ప్రేమ చిత్రం పవన్ కల్యాణ్ క్రేజ్‌ను, మార్కెట్‌ను డ‌బుల్ చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...