Home Film News Nagarjuna Car: బాబోయ్‌.. నాగార్జున అంత ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కారు కొనుగోలు చేశారా.. ధ‌ర ఎంతంటే..!
Film News

Nagarjuna Car: బాబోయ్‌.. నాగార్జున అంత ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కారు కొనుగోలు చేశారా.. ధ‌ర ఎంతంటే..!

Nagarjuna Car: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇండ‌స్ట్రీల‌లోని మోస్ట్ రిచెన్స్ ప‌ర్స‌న్స్ లో ఒక‌రు అనే విష‌యం విదిత‌మే. ఆయ‌న సినిమాల‌తో పాటు బిజినెస్‌ల‌తో ఆస్తులు బాగానే సంపాదించాడు. ఒక‌ప్పుడు నాగ్ సినిమాలు అంటే ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదాన్ని పంచేవి. కాని  ఈ మ‌ధ్య అంత‌గా అల‌రించ‌లేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొడుతున్నాయి. అయితే నాగార్జున గ్యారేజ్‌లోకి ఇప్పుడు ఒక కొత్త ల‌గ్జ‌రీ కారు వ‌చ్చి చేరింది. దీని ధ‌ర వింటే బిత్త‌ర‌పోవ‌ల్సిందే. నాగార్జున‌  కియా ఈవీ 6 కొనుగోలు చేనిస‌నట్టు తెలుస్తుండ‌గా,  ఇది ఎలక్ట్రిక్ కార్ అని అంటున్నారు.  అద్భుతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయ‌ని టాక్.

దాదాపు 60 నుండి 70 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండే ఈ కారులో వైర్లెస్ ఛార్జర్, ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. డ్రైవర్ సీటు పది రకాలు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉంటాయ‌ట‌. ఈ కారు బ్యాట‌రీని కేవలం నాలుగు నిమిషాలు ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ప్రయాణం చేసే అవ‌కాశం ఉంది . ఇక‌ ఫుల్ కెపాసిటీ 77.4 కిలో వాట్స్ ఛార్జ్ చేస్తే 528 కిలోమీటర్స్ ప్రయాణం చేయవచ్చు అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ కారుతో క‌లిసి  నాగార్జున‌, అమ‌ల కలిసి దిగిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఇటీవల టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సైతం ఓ ఖ‌రీదైన కారుని కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

కింగ్ నాగ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న  మాస్తో పాటు  ఫ్యామిలీ ఆడియెన్స్లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకున్నాడు.  నాగ్ అటు యాక్షన్ మూవీస్తో పాటు కామెడీ, డివోషనల్ జోనర్లోనూ ప‌లు సినిమాలు చేయడం వల్లే మిగతా హీరోల కంటే  కాస్త భిన్నమైన ఇమేజ్ను అయితే అందుకున్నారు.  2016లో నాగ్ న‌టించిన  సోగ్గాడే చిన్నినాయనా మాత్ర‌మే కాస్త మంచి విజయం సాధించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ఘోస్ట్ పరాజయం పొందాయి. కొడుకు నాగ చైతన్యతో కలిసి చేసిన బంగార్రాజు  యావ‌రేజ్ టాక్ అందుకుంది. ఇక ఈ రోజు నాగ్ 62వ మూవీ ప్ర‌క‌ట‌న రాగా, ఈ సినిమాతో అయిన మ‌నోడు మంచి హిట్ అందుకోవాల‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...