Home Film News Bro Teaser: బ్రో టీజర్ విడుద‌ల‌.. తేజ్, ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశారుగా..
Film News

Bro Teaser: బ్రో టీజర్ విడుద‌ల‌.. తేజ్, ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశారుగా..

Bro Teaser: జ‌నసేన పార్టీ అధినేత ప‌వన్ క‌ళ్యాణ్‌ ఒకవైపు రాజకీయాలను చూసుకుంటూనే.. మరోవైపు టాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా వారాహి యాత్ర చేస్తున్న ప‌వ‌న్ త‌న ప్ర‌సంగంతో అద‌ర‌గొడుతున్నాడు. ప‌వ‌న్ స్పీచ్ వినేందుకు జ‌నాలు తండోప‌తండాలుగా స‌భాస్థ‌లికి వ‌స్తున్నారు. దీంతోఆ ప్రాంగ‌ణాల‌న్నీ జ‌న‌సంద్రంగా మారుతున్నాయి. అయితే ప‌వ‌న్ న‌టించిన  బ్రో చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. కొద్ది సేప‌టి క్రితం మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇది చాలా ఆక‌ట్టుకుంటుంది. కాలం మీ గ‌డియారానికి అందని ఇంద్ర‌జాలం అనే డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది.

జూలై 28న విడుద‌ల కానున్న బ్రో చిత్రం తమిళంలో హిట్ అయిన వినోదయ సిత్రం మూవీకి రీమేక్‍గా రూపొందుతుంది. ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా న‌టిస్తున్నాడు.  గత ఫిబ్రవరిలో చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయింది.  షెడ్యూళ్లను వెంట వెంట‌నే పూర్తి చేసి  టాకీ పార్టును ఎవరు ఊహించనంత వేగంగా కంప్లీట్ చేసారు. అంతా పూర్తి కావ‌డంతో ఇక మూవీ ప్ర‌మోష‌న్స్ లో జోరు పెంచ‌బోతున్నారు. టీజ‌ర్ సినిమాపై చాలా అంచ‌నాలు పెంచింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్  జ్వరంతో బాధపడుతున్నా కూడా  బ్రో టీజర్ కోసం డబ్బింగ్ చెప్పాడు. ఏపీలోని  మంగళగిరిలో తన పార్టీ జనసేన  కార్యాలయంలోనే టీజర్ డబ్బింగ్ పూర్తి చేశాడు ప‌వ‌న్. చిత్ర దర్శకుడు సముద్రఖని స్వయంగా వెళ్లి డబ్బింగ్ చెప్పించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైర‌ల్‌గా మారాయి.

ఇద్ద‌రు మెగా హీరోల కాంబినేషన్‌లో రాబోతున్న ‘బ్రో చిత్రంలో క‌థానాయిక‌లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్  నటించారు.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ  ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మూవీకి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే అందిస్తుండ‌గా, థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం మంచి విజయం సాధిస్తుంద‌ని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలోను, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోను, సుజీత్ డైరెక్ష‌న్ లోను సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...