Home Film News BiggBoss7: బిగ్ బాస్ 7లో ఊహించ‌ని కంటెస్టెంట్.. ఆమె వ‌స్తే ఇక సంద‌డి ఓ రేంజ్‌లోనే..!
Film News

BiggBoss7: బిగ్ బాస్ 7లో ఊహించ‌ని కంటెస్టెంట్.. ఆమె వ‌స్తే ఇక సంద‌డి ఓ రేంజ్‌లోనే..!

BiggBoss7: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులోను స‌క్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీజ‌న్స్ పూర్తి కాగా, గ‌త సీజ‌న్ త‌ప్ప మిగ‌తా ఐదు సీజ‌న్స్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అయితే ఆరో సీజ‌న్‌లో ఉన్న లోటు పాట్లని గ‌మ‌నించిన నిర్వాహ‌కులు సీజ‌న్ 7 చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల సీజ‌న్ 7కి సంబంధించిన ప్రోమో విడుద‌ల కావ‌డంతో ఈ షో అతి త్వ‌రలోనే మొద‌లు కానుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. అయితే షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవ‌ర‌నే దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

మొన్నటి వరకు నటి మాధవీ లత పేరు వినిపించ‌గా, తనికి ఆఫ‌ర్ వ‌చ్చిన మాట నిజ‌మే కాని పాల్గొన‌డం లేద‌ని స్పందించింది. ఇక ఇప్పుడు బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ షోలో పాల్గొన‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. యూట్యూబ‌ర్స్ కి బ్యాంకాక్ పిల్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెళ్లైన త‌ర్వాత బ్యాంకాక్ వెళ్లిన  శ్రావణి సమంతపూడి… అక్కడ అనేక ప్రదేశాలు తిరుగుతూ, యూట్యూబ్ వీడియోస్ చేసి నెటిజ‌న్స్ కి మంచి వినోదం పంచుతుంది.  విజయనగరానికి చెందిన బ్యాంకాక్ పిల్లకి  త‌న యాస చాలా ప్ల‌స్ అయింది. గ‌ల గ‌ల మాట్లాడుతూ ఇట్టే అట్రాక్ట్ చేస్తుంటుంది.

ఈమె  ఛానల్‌కు రెండు మిలియన్ల పైగా సబ్‌స్క్రైబర్లున్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతుంది.అయితే రీసెంట్‌గా ఇండియాకి వ‌చ్చిన శ్రావ‌ణి బిగ్ బాస్ సీజ‌న్ 7లో పాల్గొన‌బోతుంద‌ని అంటున్నారు. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఆమె ఇక్క‌డికి వ‌చ్చింద‌ని చెప్పుకొస్తున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సారి సీజన్ 7లో   25 మందిని కంటెస్టెంట్స్‌గా  తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో ఒక డివోర్స్ జంట, సీరియల్ యాక్టర్స్, యాంకర్స్, యూట్యూబర్స్, సింగర్స్, కమెడియన్స్  ఉంటార‌ని టాక్. హోస్ట్‌గా నాగార్జున‌నే ఉంటారా లేక మ‌రెవ‌రినైన తీసుకొస్తారా అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...