Home Film News Anasuya: ఈ సారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన అన‌సూయ‌..బ‌న్నీని అంత మాట అనేసిందేంటి?
Film News

Anasuya: ఈ సారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన అన‌సూయ‌..బ‌న్నీని అంత మాట అనేసిందేంటి?

Anasuya: బుల్లితెర యాంక‌ర్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న అన‌సూయ ఆ త‌ర్వాత న‌టిగా కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో అన‌సూయ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించింది. ఇక అక్క‌డ నుండి అన‌సూయ‌కి సినిమా ఆఫ‌ర్స్ బాగానే వ‌స్తున్నాయి. దీంతో బుల్లితెరకి గుడ్ బై చెప్పి వెండితెర‌పై సంద‌డి చేస్తుంది. రీసెంట్‌గా విమానం అనే సినిమాతో ప‌ల‌క‌రించ‌గా, ఈ చిత్రం అంత‌గా ఆద‌ర‌ణ‌కి నోచుకోలేదు. ప్ర‌స్తుతం  అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 చిత్రంలో దాక్షాయ‌ణి అనే నెగెటివ్ రోల్ చేస్తుంది. ఇందులో  పుష్పరాజ్‌పై పగ తీర్చుకునేందుకు రగిలిపోయే పాత్రలో అనసూయ  క‌నిపించి అల‌రించ‌నుంది.

అయితే బ‌న్నీ సినిమాలో న‌టిస్తూ ఆయ‌న‌పైనే అన‌సూయ హాట్ కామెంట్స్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అన‌సూయ కొద్ది రోజుల క్రితం విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ తో పెద్ద గొడ‌వే పెట్టుకుంది. ఇక మ‌న‌శ్శాంతి కోసం వాటికి దూరంగా ఉంటాన‌ని స్టేట్‌మెంట్ ఇచ్చింది.  అయితే అనసూయ.. బన్నీపై చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట దుమారం రేపుతుంది. అన‌సూయ మాట్లాడిన ఓ పాత వీడియోని కొంద‌రు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ చేస్తున్నారు.

వీడియాలో  అనసూయ మాట్లాడుతూ అల్లు అర్జున్‌ హీరోనా అని  ఆమె కామెంట్‌ చేసింది. మెగా ఫ్యామిలీ అయితే హీరో అయిపోతారా? అంటూ  మొద‌లుపెట్టిన అన‌సూయ‌… `గంగోత్రి` చూసి అసలు మనవాళ్లకి ఏమైంది అని ఆశ్చ‌ర్య‌పోయింద‌ట‌. ఆ పాటలో  అత‌నిని చూలేక‌పోయాన‌ని చెప్పిన ఈ భామ‌.. బన్నీ హీరో ఏంటి?  అల్లు అర్జున్‌ లేడీ గెటప్‌లో కనిపించ‌డం..ఇది  అస్సలు చూడలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది. చాలా ఏళ్ల క్రితం అనసూయ మాట్లాడిన వీడియో క్లిప్ ఇప్పుడు వైర‌ల్ అవతుండగా, అన‌సూయని బ‌న్నీ ఫ్యాన్స్ ఆడేసుకుంటున్నారు..నువ్వు అప్పుడు బ‌న్నీని హీరోనా అని అడిగావ్… ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీనిపై ఏమంటావ్ అన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన‌సూయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...