Home Film News Actress: న‌న్ను ఇంట్లో నుండి బ‌య‌ట‌కు పంపేసారు.. క‌న్నీరు పెట్టుకున్న ఫేమ‌స్ న‌టి
Film News

Actress: న‌న్ను ఇంట్లో నుండి బ‌య‌ట‌కు పంపేసారు.. క‌న్నీరు పెట్టుకున్న ఫేమ‌స్ న‌టి

Actress: అలనాటి నాయిక మంజుల వారసురాలిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది వనిత విజ‌య్ కుమార్.ముందు త‌మిళంలో కొన్ని సినిమాలు చేసి ఆ త‌ర్వాత దేవి సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయింది. ఈ సినిమానే ఆమెకి తెలుగులో చివరి సినిమా కూడా కావ‌డం విశేషం. ఇటీవ‌ల న‌రేష్ హీరోగా తెర‌కెక్కిన మ‌ళ్లీ పెళ్లి అనే సినిమాలో మెరిసింది. అయితే వనిత విజ‌య్ కుమార్ సినిమాల క‌న్నా కూడా వివాదాల‌తో ఎక్కువ‌గా హాట్‌టాపిక్ అవుతుంది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న వనిత కొన్ని సార్లు త‌న తండ్రి త‌న పాలిట విల‌న్ అని కూడా చెప్పుకొచ్చింది. త‌న‌కి 20 ఏళ్ల వయసున్నప్పుడే ఆకాశ్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డంతో ఆమె త‌న కుటుంబానికి పూర్తిగా దూర‌మైంది.

ఆకాశ్‌తో తన మొదటి పెళ్లి గురించి తాజాగా మాట్లాడిన వ‌నిత‌.. అత‌నితో రెండేళ్ల‌కి పైగా క‌లిసి ఉన్నాయి. మాకు ఒక అబ్బాయి పుట్టాడు. అయితే మా మ‌ధ్య రిలేష‌న్ అంత బాగుండేది కాదు. నా కొడుకు మాత్ర‌మే నా జీవితంలో జ‌రిగిన దారుణాల‌కి సాక్షి. చిన్న వ‌య‌స్సులోనే నా ప‌రిస్థితి అర్ధం చేసుకొని నేను తీసుకున్న నిర్ణ‌యాల‌ని చాలా స‌పోర్ట్ చేశాడు. వాడే నాకు చాలా బ‌లం ఇచ్చాడు. విజ‌య్ శ్రీహ‌రి నా కొడుకు పేరు కాగా, నేను ఈ రోజు బ్ర‌తికి ఉండ‌డానికి అత‌నే కార‌ణం అని చెప్పుకొచ్చింది వ‌నిత‌. అయితే తాను పాపతో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు  విడాకుల‌కి అప్లై చేసింద‌ట‌. అప్పుడు త‌న త‌ల్లిదండ్రులు ఏ మాత్రం స‌పోర్ట్ చేయ‌లేద‌ని పేర్కొంది వ‌నిత‌.

న‌న్ను ఇంటి నుండి గెంటి వేసిన కూడా నాతో ధైర్యంగా నిల‌బ‌డింది నా కొడుకే. ప్ర‌స్తుతం అత‌ను నాతో కాంటాక్ట్‌లో లేడు.  అత‌నిని నాతో ఉంచుకోవ‌డానికి ఎంత ప్ర‌య‌త్నించిన కూడా అది సాధ్య‌ప‌డ‌లేదు అంటూ ఎమోష‌న‌ల్ అయింది వ‌నిత‌. అయితే   మూడు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఏ ఒక్క‌ భాగస్వామితో వనితాకు కొంత‌ సంతోషం దొరకలేదు. జీవితం అంతా వివాదాలే. సర్వస్వం అనుకున్న కొడుకు కూడా తనతో లేక‌పోవ‌డంతో ఆమెని స‌పోర్ట్ చేసే కొంద‌రు బాధ‌ప‌డుతున్నారు. అయితే త‌న జీవితంలో ఏం జరిగినా కుటుంబం తనను వద్దనుకున్నా కూడా తను మాత్రం విజయ్‌కుమార్ వారసురాలని గర్వంగా చెప్పుకుంటుంది వనితా.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...