Home Film News గుణశేఖర్ సినిమాతో అల్లు అర్జున్ కూతురి డెబ్యూ!
Film News

గుణశేఖర్ సినిమాతో అల్లు అర్జున్ కూతురి డెబ్యూ!

Allu Arha Debut With GunaShekar Film

గుణశేకర్ చేపపట్టిన మరో పౌరాణిక యజ్ఞం ‘శాకుంతలం’. ఈ మూవీ లో సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. దేవ్ మోహన్ మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మెల్లగా అంచనాలను పెంచడం మొదలెట్టింది. చారిత్రాత్మక పాత్ర అయిన శకుంతలని శేఖర్ ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి ఒకవైపు నడుస్తూ ఉంటే.. ఇప్పుడు కొత్తగా ఇందులోకి మరో స్టార్ కిడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆమె ఎవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ. రామలింగయ్య గారి మునిమనుమరాలు, అల్లు అరవింద్ గారి మనుమరాలు, అల్లు అర్జున్ & స్నేహల ముద్దుల కూతురు అంటూ ఆమెని శాకుంతలం టీం ఇన్వైట్ చేసింది. ఐతే, ఆ చిన్న పాప ఇందులో ఏం పాత్ర పోషించబోతుంది అన్న విషయం కూడా యధావిధిగా చర్చకు వచ్చేసింది. ఇప్పటిదాకా.. చాలా మంది పెద్ద సెలబ్రిటీలుగా మారిన వాళ్ళు తమ చిన్నతనంలో ఇలా హీరో, హీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్ లో చిన్నప్పటి వ్యక్తుల్లా నటించటమో.. లేదా వాళ్ళ పిల్లలుగా నటించటమో జరుగుతూనే ఉంది.

ఇప్పుడు వాళ్ళ వరసలో చేరుతోంది అల్లు అర్హ. ఇందులో బాల భరతగా కనిపించబోతుందట అర్హ. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా తన అభిమానులతో పంచుకున్నాడు. ట్విట్టర్ వేదికగా చేసిన అనౌన్స్ మెంట్ లో తమ అల్లు కుటుంబం నుండి నాలుగో తరం నటిగా తన కూతురు కూడా వినోదం పంచడానికి వచ్చేస్తుందని ప్రకటించాడు. ‘శాకుంతలం’ అనే ఈ అందమైన సినిమాలో నా కూతురికి అవకాశం ఇచ్చినందుకు గుణశేఖర్, నీలిమా దంపతులకి థాంక్స్ చెప్పాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...